హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. ఆటగాడిగా స్టేడియంలో అద్భుతమైన షాట్లతో అలరించిన సెహ్వాగ్ వీడ్కోలు అనంతరం కామెంటేటర్‌గా తన ఛలోక్తులతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
తన సహచర క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్ల పుట్టినరోజు నాడు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతున్నాడు. ట్విట్టర్‌లో సెహ్వాగ్ ట్వీట్ చేశాడంటూ చాలు అది ఓ వైరల్ అయిపోతుంది. తాజాగా బాక్సింగ్ డే మరుసటి రోజైన డిసెంబర్ 17న కొత్త సినిమా రాబోతోందని, చూడాలంటే అక్కడికి తప్పక రావాలంటున్నాడు.
ఇంతకీ డిసెంబర్ 17న సెహ్వాగ్ చూపించబోయే ఆ సినిమా ఏంటో మీకు తెలియాలంటే మీరు దీనిని చదవాల్సిందే. ప్రొ బాక్సింగ్‌లో అరంగేట్రం చేసిన విజేందర్ సింగ్ బాక్సింగ్‌లో భారత్‌కు అనేక అద్భుత విజయాలనందించాడు. ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీహోప్‌ను ఓడించి డబ్లూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా అవతరించాడు.
ఆ బౌట్ తర్వాత చాన్నాళ్లకు విజేందర్ డిసెంబర్ 17న ప్రపంచ మాజీ ఛాంపియన్ ఫ్రాన్సిస్ ఛెకాను ఎదుర్కోబోతున్నాడు. వీరిద్దరి పోరుకు ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్‌ను వీక్షించాలని, విజేందర్‌ను ఉత్సాహపరచాలని సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో తనదైన శైలిలో ట్వీట్ చేశాడు.
'డిసెంబర్ 17న ఛెకా కో విజు నే ఫెకా అనే కొత్త సినిమా విడుదల కాబోతోంది. త్యాగరాజ్ మైదానంలో వీక్షించండి' అని ట్వీట్ చేశాడు.