Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup:అప్పుడు రెండు పొరపాట్లు చేశాం.. రోహిత్ ఓపెనింగ్ మార్పును సచిన్‌ సంఘటనతో పోల్చిన సెహ్వాగ్!

Virender Sehwag Slams Team Indias Decision to Demote Rohit Sharma vs NZ Match

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీనియర్ ఓపెనర్ రోహిత్‌ శర్మకు బదులు యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ను ఓపెనింగ్‌కు తీసుకురావడంపై మాజీ క్రికెటర్లు సహా అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఇషాన్‌ను నాలుగో స్థానంలో ఆడించకుండా.. ఓపెనర్‌గా పంపింది టీమిండియా మేనేజ్మెంట్. ఈ ప్రయోగం విఫలమైంది. ఇషాన్ నాలుగు పరుగులకే పెవిలియన్ చేరాడు. భారత మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతోనే కివీస్‌ మీద భారత్‌ ఓడిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో టీమిండియా మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ బ్యాటింగ్ కూర్పుపై స్పందించాడు.

 నాలుగో స్థానంలో సచిన్:

నాలుగో స్థానంలో సచిన్:

కివీస్‌తో మ్యాచ్‌లో తీసుకున్న ఓపెనర్‌ మార్పు.. 2007 వన్డే ప్రపంచకప్‌లో సచిన్‌ టెండూల్కర్‌ను నాలుగో స్థానంలో పంపించాలనే నిర్ణయంలాంటిదేనని పేర్కొన్నాడు. రాహుల్‌ ద్రవిడ్‌ నేతృత్వంలోని భారత్‌ జట్టు 2007 ప్రపంచకప్‌లో గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. తొలుత సచిన్‌ టెండూల్కర్‌-సౌరవ్ గంగూలీ జోడీ ఓపెనింగ్‌ చేసేది. ఎప్పుడైతే వీరేంద్ర సెహ్వాగ్‌ జట్టులోకి వచ్చాడో అప్పటి నుంచి సచిన్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసేవాడు. అయితే ఈ రెండు జోడీలు తనదైన ముద్ర వేశారు. పరుగుల వరద పారించేవారు. ఈ రెండు జోడీలు ప్రత్యర్థిపై ఆరంభ ఓవర్లలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు.

 రెండు పొరపాట్లు చేశాం:

రెండు పొరపాట్లు చేశాం:

2007 వన్డే ప్రపంచకప్‌ గురించి వీరేంద్ర సెహ్వాగ్‌ మాట్లాడుతూ... 'లక్ష్య ఛేదనలో బాగా ఆడుతున్నాం. వరుసగా 17 మ్యాచుల్లో ఛేజింగ్‌ చేశాం. అలాంటిది 2007 వన్డే ప్రపంచకప్‌లో రెండు పొరపాట్లు చేశాం. అప్పటి మా కోచ్‌ (గ్రెగ్‌ ఛాపెల్‌) జట్టులోని అందరికి బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ ఉండాలని చెప్పాడు. అయితే రెండు మ్యాచ్‌లు గెలిచాక సూపర్‌-8కి వెళ్లే అవకాశం ఉంది, అప్పుడు మిగిలిన ఆరు మ్యాచుల్లో మార్పులు చేద్దామని నేను సూచించా. కోచ్‌ మాత్రం అలా కుదరదన్నాడు. అప్పటికే సచిన్‌ టెండూల్కర్ మిడిలార్డర్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేనేలేదు. రాహుల్ ద్రవిడ్, యువరాజ్‌ సింగ్‌, ఎంఎస్ ధోనీ ఉన్నారు. జట్టు బాగా ఆడనప్పుడు మీ వ్యూహాలను మార్చుకోవాలి. అప్పుడు బాగా ఎందుకు ఆడరు?. అంతేకాని జట్టులో మార్పులు చేయడం సరైంది కాదు' అని వీరూ అన్నాడు.

ద్రవిడ్‌ను తప్పించిన బీసీసీఐ:

ద్రవిడ్‌ను తప్పించిన బీసీసీఐ:

బెర్ముడా, శ్రీలంక, బంగ్లాదేశ్‌తో కూడిన గ్రూప్‌లో భారత్‌ ఉంది. బెర్ముడా మీద భారీ విజయం (257 పరుగుల తేడా) సాధించిన భారత్.. బంగ్లాదేశ్‌, శ్రీలంక చేతిలో ఓటమిపాలై గ్రూప్‌ స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టింది. స్టార్ ఆటగాళ్లు ఉన్న భారత్‌ ఇలా లీగ్ స్టేజ్ నుంచే నిష్క్రమించాడు ప్రధాన కారణం అప్పటి హెడ్‌ కోచ్ గ్రెగ్‌ ఛాపెల్‌ అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో కోచ్‌తో పాటు రాహుల్‌ ద్రవిడ్‌ను కెప్టెన్సీ నుంచి బీసీసీఐ ఉన్నపళంగా తప్పించింది. ఆపై 2007 టీ20 ప్రపంచకప్‌కు ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించాడు. మహీ తన మాయాజాలం ప్రదర్శించడంతో తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత్ ఖాతాలో వేసుకుంది. ఆపై ధోనీ కెప్టెన్సీలోనే 2011 వన్డే ప్రపంచకప్‌ను కూడా భారత్ గెలిచింది.

Story first published: Wednesday, November 3, 2021, 21:33 [IST]
Other articles published on Nov 3, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+