For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

DC vs RCB: పంత్‌.. చాలా నిరాశ చెందా! 10కి 3 మార్కులు ఇచ్చుడే ఎక్కువ నీకు: సెహ్వాగ్

Virender Sehwag slams DC skipper Rishabh Pants Captaincy against RCB, Rates 3 Out of 10

అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 1 పరుగు తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఢిల్లీ పరాజయం చెందడానికి ఆ జట్టు కెప్టెన్‌ రిషబ్ పంత్‌ చేసిన తప్పిదాలే కారణం. బెంగళూరు ఇన్నింగ్స్ చివరి ఓవర్ వచ్చే సమయానికి పేసర్లు ఇషాంత్ శర్మ, కాగిసో రబాడ, అవేష్ ఖాన్.. స్టార్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. ఇక అప్పటివరకు సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రాకు ఇంకో ఓవర్ ఉన్నా.. ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్‌తో చివరి ఓవర్ వేయించాడు. ఇక్కడే పంత్ పెద్ద తప్పిదం చేసాడు.

స్టోయినిస్‌తో బౌలింగ్

స్టోయినిస్‌తో బౌలింగ్

నిజానికి బెంగళూరు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించింది. కానీ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ తప్పిదం కారణంగా కోహ్లీసేన మెరుగైన స్కోరు చేయగలిగింది. బెంగళూరు 19 ఓవర్లు ముగిసే సరికి 148/5తో ఉంది. ఈ సమయంలో అప్పటి వరకూ కనీసం ఒక్క ఓవర్ కూడా వేయని మార్కస్ స్టోయినిస్‌తో పంత్ బౌలింగ్ చేయించాడు.

స్టోయినిస్ లయ అందుకునేలోపే ఏబీ డివిలియర్స్ పూర్తి నష్టం చేశాడు. స్టోయినిస్ ఆ ఓవర్‌లోని మొదటి బంతిని వైడ్‌గా వేశాడు. ఆపై 2, 6, 0, 6, 6, 2 ఇచ్చాడు. మొత్తంగా 23 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బెంగళూరుని 171/5తో ఇన్నింగ్స్‌ను ముగించింది. ఫీల్డర్లను మోహరించడంలో కూడా పంత్ కొన్ని తప్పులు చేశాడు.

3 మార్కులు చాలు

3 మార్కులు చాలు

ఢిల్లీ క్యాపిటల్స్‌ పరాజయం చెందడానికి రిషబ్ పంత్‌ చేసిన తప్పిదాలే కారణమని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ విమర్శించాడు. పంత్‌ నుంచి తాను చూసిన అత్యంత పేలవమైన కెప్టెన్సీ అంటూ సెహ్వాగ్‌ మండిపడ్డాడు. క్రిక్‌బజ్‌ నిర్వహించిన మ్యాచ్‌ విశ్లేషణ కార్యక‍్రమంలో పంత్‌ సారథ్యాన్ని సెహ్వాగ్‌ తప్పుబట్టాడు.

'నేను పంత్ కెప్టెన్సీకి 10లో ఐదు మార్కులు కూడా ఇవ్వను. అతడికి 3 మార్కులు చాలు. ఎందుకంటే అలాంటి తప్పులు చేశాడు. ఒక ప్రధాన బౌలర్‌ సరిగా బౌలింగ్‌ సరిగా చేయలేకపోతే కెప్టెన్‌ అంచనాలు తప్పువుతాయి. అప్పుడే కెప్టెన్‌గా బౌలింగ్‌ మార్పులు ఏం చేయాలనేది ఆలోచించాలి. ఈ విషయంలో పంత్‌ జాగ్రత్తగా ఉండక తప్పదు' అని అన్నాడు.

అప్పుడే స్మార్ట్‌ కెప్టెన్‌ అవుతాడు

అప్పుడే స్మార్ట్‌ కెప్టెన్‌ అవుతాడు

'పరిస్థితిని బట్టే వ్యూహాలు సిద్ధం చేసేవాడే స్మార్ట్‌ కెప్టెన్‌ అవుతాడు. మ్యాచుకు అనుగుణంగా బౌలింగ్ లేదా ఫీల్డ్ పొజిషన్‌లో మార్పులు చేయడం కెప్టెన్ బాధ్యత. అప్పుడే కెప్టెన్ సామర్ధ్యం బయటపడుతుంది. రిషబ్ పంత్‌ ఈ తరహా తప్పిదాలు ఇక చేయడనే అనుకుంటున్నా.

పంత్‌ ఒక మంచి కెప్టెన్‌ కావాలంటే స్మార్‌ క్రికెట్‌ ఆడాలి. అప్పుడే స్మార్ట్‌ కెప్టెన్‌ అవుతాడు' అని వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. అదే షోలో ఉన్న టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్‌ నెహ్రా మాట్లాడుతూ.. మధ్య ఓవర్లలో పంత్‌ స్లో బ్యాటింగ్‌ చేయడమే వారి ఓటమికి కారణమన్నాడు. ఛేజింగ్‌ చేసే క్రమంలో ఇద్దరు సెట్‌ అయిన బ్యాట్స్‌మన్‌ ఉండగా ఓటమి ఎదురుకావడం ప్రణాళిక లోపమేనన్నాడు.

స్ట్రైకింగ్ ఇవ్వకుండా

స్ట్రైకింగ్ ఇవ్వకుండా

లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ పవర్ హిట్టర్ షిమ్రాన్ హిట్‌మెయర్.. కైల్ జేమిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో మూడు సిక్సర్లు కొట్టి 21 పరుగులు రాబట్టాడు. దీంతో ఢిల్లీ విజయ సమీకరణం చివరి 12 బంతుల్లో 25 పరుగులుగా మారింది. హర్షల్ పటేల్ వేసిన 19వ ఓవర్లో 11 పరుగులు చేయడంతో.. చివరి ఓవర్లో ఢిల్లీకి 14 రన్స్ అవసరం అయ్యాయి. మంచి ఊపుమీదున్న హిట్‌మెయర్‌కు స్ట్రైకింగ్ ఇవ్వకుండా.. రిషబ్ పంత్ బ్యాటింగ్ చేశాడు. రెండు ఫోర్లు బాదినా.. అవి ఢిల్లీ విజయానికి సరిపోలేదు. ఒకవేళ హిట్‌మెయర్‌కు స్ట్రైకింగ్ ఇచ్చిఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది.

Story first published: Wednesday, April 28, 2021, 13:06 [IST]
Other articles published on Apr 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+