హైదరాబాద్: ట్విట్టర్ కింగ్‌గా పేరొందిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తొలి టెస్టులో ఆసీస్ చేతిలో ఓటమి పాలైన టీమిండియాపై తనదైన శైలిలో స్పందించాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో పూణెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

పూణె టెస్టు సందర్భంగా మూడో రోజు తొలి సెషన్‌లో ఆసీస్ బ్యాటింగ్‌కు ముందు సూటు బూటులో ఉన్న సెహ్వాగ్ ఓ ఫొటోతో ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను లంచ్‌లోపే ఆలౌట్ చేసి చేజింగ్ మొదలుపెట్టండంటూ టీమిండియాకు సలహా ఇచ్చాడు.
టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అంపైర్లు కేవలం ఇదే పని చేశారంటూ బ్యాట్స్‌మన్ అవుటైనప్పుడు అంపైర్స్ సూచించే నిర్ణయంలా చూపుడువేలును పైకెత్తి చూపుతూ ఉన్న ఫోటోని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అయితే సిరీస్ అప్పుడే ముగియలేదంటూ ఆస్ట్రేలియా జట్టుకు హెచ్చరికలు కూడా జారీ చేశాడు.
మ్యాచ్ ముగిసిన వెంటనే టెస్టుల్లో గేల్ వ్యక్తిగత అత్యధిక స్కోరు(333)ను సూచించేలా గేల్ ధరించే జెర్సీని, భారత్ ఓటమి పాలైన 333 పరుగులు సరిపోయాయంటూ ట్వీట్ చేశాడు. 2010లో విండీస్ బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ శ్రీలంకపై ఓ టెస్టులో సరిగ్గా 333 పరుగులు చేశాడు. దానిని గుర్తు చేస్తూ గేల్ 333 నంబర్ జెర్సీతో ఉన్న ఫొటో షేర్ చేస్తూ.. ఇండియా గేల్ తేడాతో ఓడిపోయింది అని ట్వీట్ చేశాడు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ట్వీట్‌ను సెహ్వాగ్ డిలీట్ చేశాడు. అనంతరం ఇక ఇలాంటి కష్టసమయాల్లో మంచి స్నేహితుడిగా టీమ్‌కు సపోర్ట్‌గా ఉండాలని ఫ్యాన్స్‌కు మరో ట్వీట్ ద్వారా పిలుపునిచ్చాడు.