కివీస్ ఆటగాడు రాస్ టేలర్‌కు సెహ్వాగ్ తన స్టైల్‌లో బర్త్‌డే విషెస్
హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటర్నెట్ సెన్సేషన్ అన్న విషయం తెలిసిందే. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో తనదైన శైలిలో సహచరుల పట్టినరోజులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. తాజాగా సెహ్వాగ్ న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.
'రాస్ టేలర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. న్యూజిలాండ్ జట్టు కోసం సహచరుల సాయంతో గొప్ప గొప్ప భాగస్వామ్యాలను కుట్టావు (నమోదు చేశావు) అని సెహ్వాగ్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంతేకాదు, టేలర్ జీ వీరికి నీ అవసరం ఎక్కువగా ఉంది అంటూ సెహ్వాగ్ ఓ ఫొటోని ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
చినిగిపోయిన ప్యాంటు, బనియన్, చొక్కా లేకుండా ఓ వ్యక్తి సెహ్వాగ్ పోస్టు చేసిన ఫోటోలో ఉన్నారు. వీరందరూ కూడా రాస్ టేలర్ వేసే కుట్లు కోసం ఎదురుచూస్తున్నట్లు, టేలర్‌ని టైలర్‌గా సంబోధిస్తూ సెహ్వాగ్ తనదైన శైలిలో ట్వీట్ చేశాడు. మార్చి 8 (బుధవారం) రాస్ టేలర్ 33వ పుట్టినరోజుని జరుపుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications