Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

క్రికెట్ జేమ్స్ బాండ్ ఎవరో తెలుసా?: సెహ్వాగ్ ఫన్నీ ట్వీట్

హైదరాబాద్: మంగళవారం 34వ పుట్టినరోజుని జరుపుకుంటున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ డేల్ స్టెయిన్‌‌కు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ ట్విట్టర్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Virender Sehwag sends birthday wishes to 'Cricket's James Bond'

తన సహచర ఆటగాళ్లతో పాటు సెలబ్రిటీల పుట్టినరోజులకు సెహ్వాగ్ తనదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పిన సందర్భాలు అనేకం. మంగళవారం దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ పుట్టినరోజుని పురస్కరించుకుని హ్యాపీ బర్త్‌డే క్రికెట్ జేమ్స్ బాండ్ అంటూ సెహ్వాగ్ ఫన్నీ స్టయిల్‌లో విష్ చేశాడు.

సెహ్వాగ్ ట్వీట్‌కు ముగ్ధుడైన డేల్ స్టెయిన్ 'వీరూ! నువ్వు లెజెండ్‌వి. థ్యాంక్స్' అంటూ ట్విట్టర్‌లో స్పందించాడు.

ఇదిలా ఉంటే ఇదే జూన్ 27న ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ పుట్టిన రోజు కూడా కావడం విశేషం. ఐపీఎల్‌లో 2012, 2013 సీజన్లలో వీరిద్దరూ ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఈ సందర్భంగా కెవిన్ పీటర్సన్‌కు కూడా సెహ్వాగ్ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+