
కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే..
విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఒక ఆటగాడు 2-3 మ్యాచ్‌ల్లో సరిగ్గా ఆడకపోతే తుది జట్టు నుంచి తప్పించేవాడని చెప్పాడు. కానీ బంగర్, డుప్లెసిస్ మాత్రం ఆటగాళ్లపై నమ్మకం ఉంచి కొనసాగించారని తెలిపాడు. అదే ఆర్సీబీకి సక్సెస్‌కు కారణమైందని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించిన ఆర్సీబీ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ముంబై ఇండియన్స్ సహకారంతో ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడంపై క్రిక్‌బజ్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. ఇదే జోరును కొనసాగిస్తే టైటిల్ కూడా గెలుస్తుందని జోస్యం చెప్పాడు.

సంజయ్ బంగర్ హెడ్ కోచ్‌గా...
'సంజయ్ బంగర్ హెడ్‌కోచ్‌గా రావడం.. కొత్త కెప్టెన్ చేరిక ఆర్సీబీ వ్యూహాల్లో మార్పులు తీసుకువచ్చింది. గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నపుడు.. ఒక ఆటగాడు 2-3 మ్యాచ్‌లలో సరిగా ఆడకపోతే తుదిజట్టు నుంచి తప్పించే వాడు. కానీ బంగర్, డుప్లెసిస్ టోర్నీ ఆసాంతం ఒకరిద్దరు మినహా అందరినీ కొనసాగించారు. అనూజ్ రావత్ మినహా చెత్త ప్రదర్శన కారణంగా వారు ఎవరినీ పక్కనపెట్టిన దాఖలాలు కనిపించలేదు. నిలకడగా ముందుకు సాగడం వారికి కలిసి వచ్చింది.

ఈసారి నలుగురు...
గతంలో కంటే ఆర్సీబీ బలంగా ఉంది. గతేడాది విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ను ఔట్ చేస్తే సరిపోతుందని ప్రత్యర్థి జట్టు భావించేవి. కానీ ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు దినేశ్ కార్తీక్, మ్యాక్స్‌వెల్ రాణిస్తున్నారు. ఇదే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరడానికి కారణమైంది'అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.