Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవాలా?.. వీరేంద్ర సెహ్వాగ్‌ ఏం చెప్పాడంటే?

Virender Sehwag Says Virat Kohli Continuing His Captaincy In ODI & Test Cricket Is Good For India
T20 World Cup : కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పాలనుకోవడం Virat Kohli వ్యక్తిగత నిర్ణయం..! - Sehwag

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 క్రికెట్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లకు విరాట్ కోహ్లీ గుడ్ బై చెప్పేసిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ 2021కు ముందే భారత జట్టు టీ20 పగ్గాలు వదిలిస్తున్నా అని కోహ్లీ చెప్పేశాడు. మెగా టోర్నీలో భాగంగా సోమ‌వారం దుబాయ్ వేదికగా న‌మీబియాతో జ‌రిగిన టీ20 మ్యాచ్‌.. కెప్టెన్‌గా కోహ్లీకి చివ‌రిది. ఇక కొత్త టీ20 కెప్టెన్ కోసం ఇప్పటికే భారత నియంత్రణ క్రికెట్ మండలి (బీసీసీఐ) కసరత్తులు మొదలెట్టింది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ రేసులో ముందువరుసలో ఉన్నాడు. అయితే రోహిత్‌కు ఇప్పటికే 34 ఏళ్లు కాబట్టి.. లోకేష్ రాహుల్ లాంటి యువకులను కూడా బీసీసీఐ నియమించే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది.

కెప్టెన్సీ భవిష్యత్తుపై నీలినీడలు

కెప్టెన్సీ భవిష్యత్తుపై నీలినీడలు

టీ20 క్రికెట్ జ‌ట్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లకు విరాట్ కోహ్లీ ఇప్పటికే గుడ్ బై చెప్పగా.. వన్డే, టెస్టు ఫార్మాట్‌ల నుంచి కూడా అతడిని తప్పించాలని కొందరు సోషల్ మీడియాలో అంటున్నారు. దాంతో విరాట్ కెప్టెన్సీ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. కోహ్లీ కెప్టెన్‌గా అద్భుతంగా జట్టును నడిపిస్తున్నాడని.. వన్డే, టెస్ట్‌లలో నాయకత్వ పాత్రను వదిలకూడదని వీరూ అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మిగతా రెండు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి పూర్తిగా తప్పుకోవాలా వద్దా అనే ఓ అభిమాని ప్రశ్నకు సెహ్వాగ్ ఇలా స్పందించాడు.

వన్డే, టెస్టుల్లో సారథ్యం చేయాలి

వన్డే, టెస్టుల్లో సారథ్యం చేయాలి

'కెప్టెన్సీ అనేది విరాట్ కోహ్లీ సొంత నిర్ణయం. కానీ కోహ్లీ మిగిలిన రెండు ఫార్మాట్ల (వన్డే, టెస్టు) కెప్టెన్సీని విడిచిపెడతాడని నేను అనుకోను. కేవలం ఆటగాడిగా ఆడాలనుకుంటే.. అది అతని నిర్ణయం. విరాట్ కెప్టెన్సీలో భారత్ బాగా ఆడుతుంది. కెప్టెన్‌గా అతని రికార్డు అద్భుతమైనది. భాతర్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా పేరుగాంచాడు. కోహ్లీ చాలా తెలివైనవాడు, దూకుడు కెప్టెన్. భారత జట్టుకు ముందునుంచి నాయకత్వం వహిస్తున్నాడు. వన్డేలు, టెస్టులలో కెప్టెన్సీని వదిలివేయడం లేదా వదలకపోవడం కోహ్లీ వ్యక్తిగత నిర్ణయం. వన్డే, టెస్టుల్లో సారథ్యం చేయాలని నేను సూచిస్తున్నా' అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

భారత్ ఆత్మపరిశీలన చేసుకోవాలి

భారత్ ఆత్మపరిశీలన చేసుకోవాలి

ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో 2013 ఛాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత భారత్ ఇంతవరకు ఐసీసీ టైటిల్‌ను గెలుచుకోలేదు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందిస్తూ.. ఐసీసీ టోర్నమెంట్‌లలో జట్టు పేలవ ప్రదర్శనకు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. 'ఇలాంటి సమయంలో అందరం జట్టుకు మద్దతు ఇవ్వాలని నాకు తెలుసు. కానీ భారత జట్టు చాలాకాలం నుంచి ఏ ప్రధాన ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవలేకపోయింది. దీనిపై టీమిండియా కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ద్వైపాక్షిక సిరీస్‌లు గెలవడమే కాదు.. ప్రపంచ టోర్నీలను గెలిస్తేనే ప్రజలు మినల్ని గుర్తుంచుకుంటారు. ఈ విషయంపై బీసీసీఐ దృష్టి సారించాలి' అని వీరూ చెప్పుకొచ్చాడు.

32 టీ20 మ్యాచ్‌లో విజయాలు

32 టీ20 మ్యాచ్‌లో విజయాలు

టీమిండియాకు విరాట్ కోహ్లీ 50 మ్యాచుల్లో టీ20 జ‌ట్టుకు సార‌థ్య బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. కోహ్లీ నాయ‌క‌త్వంలో భారత్ 32 టీ20 మ్యాచ్‌ల‌ను గెలిచింది. మ‌రో 16 మ్యాచ్‌ల‌ను ఓడిపోయింది. ఇక రెండు మ్యాచ్‌లలో ఫ‌లితం రాలేదు. టీ20లలో కోహ్లీ సారథ్యంలో భారత్ ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా.. మంచి విజయాలు అందించాడు. టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్నా.. టెస్టులు, వ‌న్డేల‌కు మాత్రం కోహ్లీనే ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నాడని తెలుస్తోంది. టీమిండియా టీ20 మ్యాచ్‌ల‌కు ఇక నుంచి కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను రోహిత్ శ‌ర్మ చేప‌డుతాడ‌ని కోహ్లీ న‌మీబియాతో మ్యాచ్‌లో చెప్పకనే చెప్పాడు. బీసీసీఐ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Story first published: Tuesday, November 9, 2021, 12:01 [IST]
Other articles published on Nov 9, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+