
తాజాగా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కోహ్లీని పొగడ్తల్లో ముంచెత్తాడు. విరాట్ కెప్టెన్సీ స్టైల్ తననెంతో ఆకట్టుకుందని అన్నాడు. ముఖ్యంగా కోహ్లీ దూకుడును చూస్తుంటే.. గంగూలీ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌లా ఉన్నాడని కొనియాడాడు.
{tweet2
'కెప్టెన్‌గా కోహ్లీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాడు. బాధ్యతతో తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో కూడా కోహ్లీ సేన అద్భుతాలను సృష్టిస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కోహ్లీ కెప్టెన్సీ గొప్పతనం ఏంటంటే.. ఒక్కో ఆటగాడి నుంచి అతను అత్యుత్తమ ప్రతిభను వెలికితీస్తాడు. అతని బలం ప్రస్తుతం ఉన్న బౌలింగ్ లైనపే. ఏ రోజైతే బౌలర్లు సరిగ్గా ప్రదర్శన చేయరో ఆ రోజు కోహ్లీ పతనం ప్రారంభమవుతుంది' అని సెహ్వాగ్ అన్నాడు.
'గంగూలీ కెప్టెన్సీలో మనం విదేశాల్లో ఎన్నో సిరీస్ విజయాలను చూశాం. ఇప్పుడు అలాంటి ధోరణి కోహ్లీలో కనిపిస్తోంది. అతని నాయకత్వంలో భారత్ సాధించిన విజయాలు.. అతన్ని ఉత్తమ కెప్టెన్లలో ఒకడిగా నిలబెట్టాయి. గత ఎనిమిది సిరీస్ విజయాలను పరిశీలిస్తే కోహ్లీ నం.1 సారథి అని చెప్పక తప్పదు. అయితే ఈ సమయంలో గత ఉత్తమ కెప్టెన్లతో అతన్ని పోల్చడం ఇక్కడ సమంజసం కాదు. అలా పోల్చాలంటే కోహ్లీకి ఇంకా సమయం, మరింత అనుభవం కావాలి' అని సెహ్వాగ్ అన్నాడు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను కోహ్లీ సేన 4-1తో గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, నామమాత్రంగా జరుగుతున్న ఆఖరి వన్డే ఆరో వన్డే శుక్రవారం ఇరు జట్ల మధ్య జరగనుంది. విజయాల పరంపర కొనసాగించాలని ఒకరు, పరువు నిలుపుకునే ప్రయత్నంలో మరొకరు శ్రమించనున్నారు.