షోయబ్ అక్తర్ బౌలింగ్ ఆడాలంటే భయపడేవాడిని.. కానీ దంచికొట్టేవాడిని: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ బౌలింగ్ శైలిపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ బౌలింగ్ శైలి చాలా భిన్నంగా ఉండేదని, అతను తన మోచేతిని కదలిస్తూ బౌలింగ్ చేసేవాడని చెప్పాడు. అక్తర్ బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్దంగా అనిపించేదని, కానీ ఐసీసీ మాత్రం అతనిపై ఏనాడు చర్యలు తీసుకోలేదని చెప్పాడు. హోమ్ ఆఫ్ హీరోస్ పేరిట ఓ చానెల్ నిర్వహిస్తున్న ఎపిసోడ్‌లో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఎల్బోను కదలిస్తూ..

ఎల్బోను కదలిస్తూ..

'షోయబ్ అక్తర్‌ తన ఎల్బోను కదలిస్తూ బౌలింగ్‌ చేసేవాడు. అయితే ఐసీసీ మాత్రం అక్తర్‌ బౌలింగ్‌ను ఏనాడు బ్యాన్‌ చేయలేదు. ఇక ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ బ్రెట్‌ లీ బౌలింగ్‌ యాంగిల్‌ కాస్త డౌన్‌లో వస్తుంది.. అందువల్ల అతని బౌలింగ్‌ పెద్ద కష్టంగా అనిపించదు. అయితే షోయబ్‌ బౌలింగ్‌లో మాత్రం బంతి ఎక్కడి నుంచి వస్తుందో తెలిసేది కాదు. అందుకే అక్తర్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించేది. న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షేన్‌ బాండ్‌ కూడా నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లలో ఒకడు. అతని స్వింగ్‌ బౌలింగ్‌ ఎక్కువగా ఆఫ్‌స్టంప్‌ అవతల పడుతూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టేది.

భయం ఉండేది..

భయం ఉండేది..

బ్రెట్‌ లీ బౌలింగ్‌లో ఆడడం పెద్దగా భయం లేనప్పటికి.. అక్తర్‌ను మాత్రం నమ్మలేని పరిస్థితి ఉండేది. అక్తర్ సంధించే బీమర్‌.. యార్కర్‌ ఎక్కడ నా కాలుకు తగులుతుందోనని భయపడేవాడిని. కానీ బ్యాటింగ్‌ మాత్రం ఎప్పుడూ సౌకర్యంగా చేసేవాడిని. అతని అదనపు పేస్‌తో బౌండరీలకు తరలిస్తూ పండుగ చేసుకునేవాడిని. ధాటిగా ఆడటమే నా బ్యాటింగ్ శైలి. సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలు సెంచరీ కోసం 150-200 బంతులు ఆడేవారు.

అలా ఆడితే నాకు గుర్తింపు ఉండేది కాదు..

అలా ఆడితే నాకు గుర్తింపు ఉండేది కాదు..

నేను కూడా వారిలానే ఆడితే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. ధాటిగా ఆడి పరుగులు చేయడంతోనే నాకు గుర్తింపు లభించింది. ఇక క్రీజులో కడవరకు నిల్చుంటే నేను 250 పరుగులు చేయగలను. ఆ ప్రక్రియలో నేను 100, 150, 200 పరుగుల మార్క్‌ను సునాయసంగా ధాటేవాడిని. ఈ క్రమంలో 90ల్లో బంతిని సిక్సర్ బాదేందుకు ఏ మాత్రం సంశయించేవాడిని కాదు. ఎందుకంటే 100 కొట్టగలననే నాపై నమ్మకం ఉండేది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఇక వీరేంద్ర సెహ్వాగ్‌ పాకిస్థాన్‌పై 90 సగటుతో సెంచరీ, రెండు డబుల్‌ సెంచరీలు, ఒక ట్రిపుల్‌ సెంచరీ చేశాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Tuesday, May 17, 2022, 18:20 [IST]
Other articles published on May 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X