ప్రతిభ ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేయాలి.. యోయో టెస్ట్‌పై సెహ్వాగ్ ఫైర్!

న్యూఢిల్లీ: ఆటగాళ్లను వారి ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగా ఎంపికచేయాలే తప్పా యో-యో టెస్ట్ ఆధారంగా కాదని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. క్రికెటర్లు జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే యోయో టెస్ట్‌ తప్పనిసరి అన్న విధానంపై సెహ్వాగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. తమ తరంలో ఈ నిబంధన ఉంటే తనతో పాటు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ ఎవరూ ఎంపికయ్యేవారు కాదని స్పష్టం చేశాడు.

ఇక ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలు పెంచేక్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) 2018లో యోయో టెస్ట్‌ను తీసుకొచ్చింది. జట్టులోకి రావాలంటే ఈ టెస్ట్‌ను అధిగమించడం తప్పనిసరి చేసింది. తాజాగా ఈ టెస్ట్‌ కనీస అర్హతను 16:1 నుండి 17:1 చేయడంతో పాటు అదనంగా రెండు కిలోమీటర్లతో కూడిన మరో టెస్ట్‌ను ఆటగాళ్ల ముందుకు తీసుకొచ్చింది. ఆటగాళ్లకు ఈ రెండు పరీక్షల్లో కనీసం ఒక్కటైనా నెగ్గడం తప్పనిసరి చేసింది.

మంచి చాన్స్ మిస్సయ్యారు..

మంచి చాన్స్ మిస్సయ్యారు..

ఈ కొత్త నిబంధనల కారణంగా యువ ఆటగాళ్లు రాహుల్ తెవాటియా, వరుణ్ చక్రవర్తీలు భారత జట్టుకు ఆడే సువర్ణవకాశాన్ని కోల్పోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు ఈ ఇద్దరు ఎంపికైనా.. ఫిట్‌నెస్ టెస్ట్ విఫలమవడంతో అవకాశాన్ని అందుకోలేకపోయారు. గతంలో అంబటి రాయుడు, సంజూ శాంసన్, మహ్మద్ షమీ, యువరాజ్ సింగ్ వంటి ఆటగాళ్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తాజాగా క్రిక్‌బజ్‌తో మాట్లాడిన వీరేంద్ర సెహ్వాగ్.. ఈ ఫిట్‌నెస్ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇటీవల కాలంలో చాలామంది భారత క్రికటర్లు యోయో టెస్ట్‌లో(ఫిట్‌నెస్‌ టెస్ట్‌) విఫలమైన కారణంగా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశాన్ని కోల్పోయారన్నాడు.

సచిన్, గంగూలీ కూడా..

సచిన్, గంగూలీ కూడా..

ఆటగాళ్లకు మొదటగా అవకాశాలు కల్పించి ఆతరువాత వారి ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాలని ఆయన బీసీసీఐకి సూచించాడు. ఇలాంటి టెస్ట్‌లు తమ జమానాలో జరిగి ఉంటే సచిన్‌, గంగూలీ, లక్ష్మణ్‌ లాంటి దిగ్గజ ఆటగాళ్లకు అసలు అవకాశాలే వచ్చేవి కావన్నాడు. ‘ఫిట్‌నెస్ కన్నా నైపుణ్యం చాలా ముఖ్యం. టీమ్ ఫిట్‌‌గా ఉండి కావాల్సిన నైపుణ్యాలు లేకుంటే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ప్రతిభ, నైపుణ్యాల ఆధారంగానే ఆటగాళ్లను తీసుకోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా వారి ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేలా చేయాలి. ఓ ఆటగాడు 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి, మ్యాచ్ మొత్తం ఫీల్డింగ్ చేయగలిగితే సరిపోతుంది.

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి షాక్.. లీగ్ నుంచి తప్పుకున్న స్టార్ ఆల్‌రౌండర్!

పాండ్యాకు వర్క్‌లోడ్ సమస్య..

పాండ్యాకు వర్క్‌లోడ్ సమస్య..

ఇక్కడ యోయో టెస్ట్ గురించి నేను ఒక్కటి చెప్పదల్చుకున్నాను. పరుగు విషయంలో హార్దిక్ పాండ్యాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అతను బౌలింగ్ చేస్తే వర్క్‌లోడ్ సమస్య వస్తుంది. అలాగే మరోవైపు అశ్విన్, వరుణ్ చక్రవర్తీ యోయో టెస్ట్ విఫలమవడంతో జట్టులో చోటు కోల్పోయారు. కాబట్టి యోయో టెస్ట్‌తో నేను ఏకీభవించను. ఈ ప్రమాణాలు ఇంతకు ముందు ఉంటే.. సచిన్ టెండూల్కర్, లక్ష్మణ్, గంగూలీ‌లకు కూడా అవకాశాలు వచ్చేవి కావు. మా తరంలో ఫిట్‌నెస్ట్ టెస్ట్ ఉన్నా ఇంత కఠినంగా ఉండేది కాదు. 12.5 మార్క్‌ మాత్రమే ఉండేది.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, March 31, 2021, 18:12 [IST]
Other articles published on Mar 31, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X