ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేసిన ఘోర తప్పిదం ఇదే: వీరేంద్ర సెహ్వాగ్

న్యూఢిల్లీ: తమ మాజీ కెప్టెన్, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను వదులుకొని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర తప్పిదం చేసిందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఈ తప్పిదం కారణంగా ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిదారిపట్టిందని అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్‌ను రిటైన్ చేసుకొని ఉంటే సన్‌రైజర్స్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నాడు.

ఇక ఈ సీజన్‌‌ను వరుస ఓటములతో ప్రారంభించిన ఆరెంజ్ ఆర్మీ.. ఆ తర్వాత వరుసగా 5 విజయాలందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. కానీ మళ్లీ వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసుకుంది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ టీమ్ గురించి క్రిక్ బజ్ షోలో మాట్లాడిన సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వార్నర్‌ను పక్కనపెట్టి..

వార్నర్‌ను పక్కనపెట్టి..

డేవిడ్ వార్నర్‌ పట్ల సన్‌రైజర్స్‌ హైదరాబాద్ వ్యవహరించిన తీరు సరికాదన్నాడు.'ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ రిటైన్ చేసుకోవాల్సింది. ఒకవేళ డేవిడ్ వార్నర్ స్థానంలో భారత ఆటగాడే ఉంటే అతన్ని తప్పించేవారా? ముమ్మాటికి అతన్ని కొనసాగించేవారు. వార్నర్‌కు సన్‌రైజర్స్‌ మేనేజ్‌మెంట్ మద్దతుగా నిలవాల్సింది. ఒకవేళ వారు అలా చేసి ఉంటే వార్నర్‌ కచ్చితంగా సన్‌రైజర్స్‌తోనే ఉండేవాడు. ఏదేమైనా డేవిడ్‌ వార్నర్‌ను వదులుకుని సన్‌రైజర్స్‌ పెద్ద తప్పే చేసింది.

ఒక్క సీజన్‌కే..

ఒక్క సీజన్‌కే..

కేవలం ఒక్క సీజన్‌ సరిగ్గా ఆడనంత మాత్రాన అతని పట్ల మరీ ఇంత దారుణంగా వ్యవహరించడం సరైనది కాదు. ప్రతి క్రికెటర్‌కు గడ్డు పరిస్థితులు సహజం. విరాట్‌ కోహ్లీ చివరి మ్యాచ్‌లో అర్ధ శతకం సాధించి ఉండకపోతే.. ఈ సీజన్‌ అతనికి చేదు జ్ఞాపకంగా మిగిలేది. విఫలమైనంత మాత్రాన కోహ్లీని బెంగళూరు వదిలేయదు? పక్కనపెట్టలేదు కదా?. వార్నర్‌కు అండగా ఉండి ఉంటే ఈ రోజు సన్‌రైజర్స్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ సీజన్‌లో వార్నర్ అద్బుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. అతనో మంచి ప్లేయర్'అని వీరేంద్ర సెహ్వాగ్‌ కొనియాడాడు.

డగౌట్‌లోకి కూడా రాణించకుండా..

డగౌట్‌లోకి కూడా రాణించకుండా..

గత సీజన్‌లో దారుణంగా విఫలమైన వార్నర్ పట్ల సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. మనీశ్ పాండే విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ తీరును బాహటంగా తప్పుబట్టాడనే ఆగ్రహంతో అతన్ని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించడంతో పాటు జట్టు నుంచి పక్కనపెట్టింది. 2016లో జట్టుకు టైటిల్ అందించాడనే సోయి లేకుండా ఘోరంగా అవమానించింది. కనీసం టీమ్ డగౌట్‌లోకి కూడా అనుమతించలేదు.

కసితీర చెలరేగాడు..

కసితీర చెలరేగాడు..

ఇక తనను అవమానించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి వార్నర్ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఢిల్లీ, సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వార్నర్ కసితీర చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 92 పరుగులతో అజేయంగా నిలిచి సన్‌రైజర్స్‌ను చిత్తు చేశాడు.

ఐపీఎల్ 2022 మెగావేలానికి ముందు హైదరాబాద్‌ వార్నర్‌ను వదిలేయగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐపీఎల్‌-2022 మెగా వేలంలో 6.25 ​కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. లేట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ఓపెనర్‌ బ్యాటర్‌ దుమ్ములేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఆడిన 11 మ్యాచ్‌లలో 427 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 92 నాటౌట్‌. అది కూడా సన్‌రైజర్స్‌పైనే కావడం గమనార్హం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, May 21, 2022, 16:17 [IST]
Other articles published on May 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X