
హైదరాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తనను తాను అవమానించుకోవడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఇటీవలే ఆయన అల్ జజీరా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కశ్మీర్ కోసం భారత్‌తో యుద్ధం జరగవచ్చని అన్న సంగతి తెలిసిందే.
అణు శక్తి ఉన్న రెండు దేశాల మధ్య ఏదైనా పెద్ద ఘర్షణ లేదా యుద్ధం జరిగే అవకాశం ఉందా? అని ప్రశ్నించినప్పుడు ఆయన "అవును, రెండు దేశాల మధ్య యుద్ధ ప్రమాదం ఉంది" అని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ తీవ్రవాదం వ్యాపింప చేస్తోందని ఆరోపిస్తున్న భారత్.. ఈ అంశం నుంచి ప్రపంచం దృష్టిని మళ్లించాలని చూస్తోందని అన్నారు.
ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో సైతం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ "ఇస్లామోఫోబియా ప్రజలను విభజిస్తోంది. ముసుగు ధరించడం ఓ ఆయుధంలా మారిపోయింది. ఓ మహిళ దుస్తులను తీసేయొచ్చు కానీ, మరిన్ని దుస్తులు ధరించలేని పరిస్థితి ఉంది. ప్రత్యేకించి 9/11 దాడి తర్వాత పాశ్చాత్య దేశాల నాయకులు కొందరు ఇస్లాంకి, టెర్రరిజంకి ముడిపెట్టడం వల్ల ఇలా జరిగింది" అని అన్నారు.
కొంతమంది చేసిన పని వల్ల ముస్లింలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ "న్యూయార్క్‌లో కూర్చున్న ఓ వ్యక్తి సంప్రదాయ ముస్లింలు, అతివాద ముస్లింలు అని ఎలా భేదం చూపించగలరు?" అని ప్రశ్నించారు. ఐక్యరాజ్య సమితిలో ఇమ్రాన్ ఖాన్ ప్రసంగంపై ఓ అమెరికన్ ఛానల్ స్పష్టత తీసుకునే క్రమంలో ఆయన చైనాలో మౌలిక సదుపాయాలను ఇమ్రాన్ మెచ్చుకొంటూ.. అమెరికాలో చిన్నకార్లు కూడా ప్రమాదాల బారిన పడుతున్నాయని వ్యాఖ్యానించారు.
దీంతో ఆ న్యూస్ ఛానల్ యాంకర్ ఇమ్రాన్ ఖాన్‌ను అగౌరవపరిచే విధంగా మాట్లాడారు. మీరు ఓ ప్రధానిలా కాకుండా వెల్డింగ్ చేసే వ్యక్తిలా మాట్లాడుతున్నాడని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఉద్దేశించి ఆయన లైవ్‌లోనే మాట్లాడటం విశేషం.
ఈ వీడియోని తన ట్విట్టర్‌లో షేర్ చేసిన సెహ్వాగ్ తనదైన శైలిలో కామెంట్ పెట్టాడు. "అభాసుపాలయ్యేందుకు ఇమ్రాన్ కొత్తదారులు వెదుకుతున్నాడు" అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు