ఆ విషయం ధోనికి బాగా తెలుసు.. కోహ్లీ కెప్టెన్సీపై సెహ్వాగ్ పరోక్ష వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : జట్టు ఎంపిక విషయంలో కెప్టెన్‌గా మహేంద్రసింగ్ ధోనికి ఉన్న స్పష్టత మరెవరికీ ఉండేది కాదని టీమిండియా మాజీ క్రికెటర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు. ఆటగాళ్లకు మద్దతుగా నిలవడం ఎంత ముఖ్యమో అతనికి బాగా తెలుసన్నాడు. ఓ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. ధోని కెప్టెన్సీకి ప్రస్తుతానికి ఉన్న తేడాను ఈ డాషింగ్ ఓపెనర్ విశ్లేషించాడు.

కోహ్లీ కెప్టెన్స్‌పై పరోక్షంగా..

కోహ్లీ కెప్టెన్స్‌పై పరోక్షంగా..

టీ20ల్లో ఐదోస్థానంలో కేఎల్ రాహుల్‌ బరిలోకి దిగి విఫలమైమతే ప్రస్తుత టీమ్‌మేనేజ్‌మెంట్ అండగా నిలవదని, కానీ ధోని హయాంలో అలా ఉండేది కాదని పరోక్షంగా కోహ్లీ కెప్టెన్సీ తప్పిదాలను చెప్పుకొచ్చాడు.

‘ఐదో స్థానంలో కేఎల్ రాహుల్ ఓ నాలుగుసార్లు విఫలమైతే ప్రస్తుత టీమ్‌మేనేజ్‌మెంట్ వెంటనే అతని బ్యాటింగ్ ఆర్డర్ మారుస్తుంది. కానీ ధోని మాత్రం ఇలా చేసేవాడు కాదు. అలాంటి స్థితిలో ఆటగాళ్లకు మద్దతివ్వడం ఎంతో ముఖ్యమో అతనికి బాగాతెలుసు. అందుకే వారికి అండగా నిలుస్తూ ప్రోత్సహించేవాడు'అని ఈ డాషింగ్ ఓపెనర్ తెలిపాడు.

టాలెంట్‌పై ఎప్పుడూ ఓ కన్ను..

టాలెంట్‌పై ఎప్పుడూ ఓ కన్ను..

‘ధోని కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులోని ప్రతీ బ్యాట్స్‌మన్ ప్లేస్‌పై అతనికి ఓ స్పష్టత ఉండేది. ఇండియన్ క్రికెట్‌ను ముందుకు తీసుకుపోయే టాలెంట్ ఆటగాళ్లపై అతనెప్పుడు ఓ కన్నేసి ఉంచేవాడు. లిమిటెడ్ ఓవర్ల ఫార్మాట్‌లో టాపార్డర్స్‌ను గుర్తించడం సులువు. కానీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌‌ తయారు చేయాలంటే మాత్రం వారికి కెప్టెన్ మద్దతు చాలా అవసరం. విఫలమైనా మరిన్ని అవకాశాలిస్తూ అండగా నిలవాలి'అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

అలా అయితే ఎప్పటికీ బిగ్ ప్లేయర్ కాలేం..

అలా అయితే ఎప్పటికీ బిగ్ ప్లేయర్ కాలేం..

వారికి అవకాశాలు రాకుంటే, ఎలా నేర్చుకుంటారని, ఇంకెలా బిగ్ ప్లేయర్ అవుతారని ప్రశ్నించాడు. ఓపెనింగ్ చేయక ముందు తాను మిడిలార్డర్‌లో ఆడి చాలా తప్పులు చేశానని, కొన్ని మ్యాచ్‌ల ఓటములకు కూడా కారణమయ్యానని తెలిపాడు. బెంచ్‌కే పరిమితమైతే ఎప్పటికీ గొప్ప ప్లేయర్లు కాలేరని, ఆటగాళ్లు సమయంతో పాటు అవకాశాలు కావాలని ఈ లెజండరీ ఓపెనర్ తెలిపాడు.

మిడిల్ సమస్య

మిడిల్ సమస్య

టాపార్డర్ చెలిరేగినంత వరకు ఇండియాకు తిరుగులేదు. కానీ టాప్‌ 3 బ్యాట్స్‌మన్ విఫలమైనప్పుడే వచ్చిన చిక్కంతా. ఈ సమస్యతోనే గతేడాది వన్డే వరల్డ్ కప్.. అంతకుముందు చాంపియన్స్ ట్రోఫీని ఇండియా కోల్పోయింది. నీడలా వెంటాడుతున్న ఈ సమస్యకు టీమ్‌మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకు పరిష్కారం కనుగోలేకపోయింది. వన్డే వరల్డ్ కప్ ముందు నుంచి చాలా మంది ఆటగాళ్లను ప్రయోగించినా ఎవరిపై ఓ స్పష్టతకు రాలేకపోయింది. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ సెహ్వాగ్ టీమ్‌మేనేజ్‌మెంట్‌ను హెచ్చరిస్తున్నాడు. అంబటి రాయుడు, విజయ్ శంకర్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, మనీష్ పాండే ఇలా చాలా మంది ఆటగాళ్లను ప్రయోగించి ఎవరిపై ఓ క్లారిటీ రాలేకపోయిన ఇండియా చేసిన తప్పెంటో సెహ్వాగ్ తెలియజేసే ప్రయత్నం చేశాడు. ఒకటి రెండు అవకాశాలతో సమస్యకు పరిష్కారం లభించదని, ఆటగాళ్లకు టీమ్‌మేనేజ్‌మెంట్ అండ ఎంతో అవసరమని .. ముఖ్యంగా కెప్టెన్ మద్దతుగా నిలవాలని నొక్కిచెబుతున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, January 21, 2020, 13:26 [IST]
Other articles published on Jan 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X