బ్రిస్బేన్ టెస్టుకు 11 మంది ఫిట్‌గా లేకపోతే.. ఆస్ట్రేలియాకు వెళ్లి ఆడడానికి సిద్ధం: సెహ్వాగ్

ఢిల్లీ: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో గాయాల రూపంలో టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్న విషయం తెలిసిందే. వ‌రుస‌గా ఒక్కో ప్లేయ‌ర్ గాయ‌ప‌డుతూ.. సిరీస్‌కు దూర‌మ‌వుతున్నారు. గాయ‌ప‌డి ఆస్ట్రేలియా టూర్‌కు మొత్తంగా దూర‌మైన వాళ్లు, మ‌ధ్య‌లో గాయ‌ప‌డి వెళ్లిపోయిన వారి సంఖ్య దాదాపు ఎనిమిదికి చేరింది. మూడో టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయ‌ప‌డ్డ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌.. కోలుకున్నాడు. అయితే ప్ర‌స్తుతం టీమ్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న జ‌స్‌ప్రీత్ బుమ్రా కూడా గాయ‌ప‌డ్డాడు. ఉద‌ర కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో అత‌డు నాలుగో టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. హనుమ విహారి కూడా ఔట్ అయ్యాడు.

గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా:

గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా:

ఐపీఎల్ 2020 నుంచి ఆస్ట్రేలియా పర్యటనవరకు ఎన్నడూ లేనివిధంగా భారత ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవలే కోలుకొని జట్టులోకి వచ్చాడనుకుంటే.. మరోవైపు గాయాలతో స్టార్ ఆటగాళ్లంతా ఒక్కక్కరుగా దూరమవుతున్నారు. భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జ‌స్‌ప్రీత్ బుమ్రా గాయాలతో ఆటకు దూరమయ్యారు. రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ సైతం గాయపడినా నెట్టుకొస్తున్నారు. దీంతో జట్టులో గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా.. గాయపడని జాబితా చెప్పడమే చాలా సులువుగా ఉంది.

 అందుబాటులో ఉన్న ఆటగాళ్లు వీరే:

అందుబాటులో ఉన్న ఆటగాళ్లు వీరే:

ప్రస్తుతం నాలుగు టెస్ట్‌ల సిరీస్ 1-1తో సమంగా ఉంది. సిరీస్ డిసైడ్ మ్యాచ్ జనవరి 15 నుంచి గబ్బాలో ప్రారంభం కానుంది. గాయాల నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు జట్టును ఎంపిక చేయడం భారత టీమ్‌మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలొనొప్పిగా మారనుంది. ప్రస్తుతానికి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చేటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, రిషభ్ పంత్, వృద్ధిమాన్ సాహా, పృథ్వీ షా, ఆర్ అశ్విన్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకుర్, టీ నటరాజన్, కుల్దీప్ యాదవ్‌లు మాత్రమే అందుబాటలో ఉన్నారు. ఇక మయాంక్ అగర్వాల్ స్కానింగ్ రిపోర్ట్స్ రావాల్సి ఉంది.

 ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధం:

ఆస్ట్రేలియాకు వెళ్లడానికి సిద్ధం:

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుగో టెస్ట్ లోపు ఎంత మంది ఫిట్‌గా ఉంటారో లేదో తెలియదు. బ్రిస్బేన్ టెస్టుకు 11 మంది టీమిండియా ప్లేయర్స్ అందుబాటులో ఉంటారా? అనే సందేహం కలుగుతోంది. గాయాలతో ఒక్కరుగా ఇంటిబాట పడుతుండడంతో.. భారత మాజీ బ్యాట్స్‌మన్ వీరేందర్ సెహ్వాగ్ సరదాగా స్పందించాడు. బ్రిస్బేన్ టెస్టుకు 11 మంది ఫిట్‌గా లేకపోతే.. ఆస్ట్రేలియాకు వెళ్లి ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. 'ఇంతమంది ఆటగాళ్లు గాయపడ్డారు. బ్రిస్బేన్ టెస్టుకు 11 మంది ఫిట్‌గా లేకపోతే.. ఆస్ట్రేలియాకు వెళ్లి ఆడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బీసీసీఐ.. క్వారంటైన్ చూసుకో' అని సెహ్వాగ్ చమత్కరించాడు. తన ట్వీట్‌కు బుమ్రా, షమీ, ఉమేష్, రాహుల్, జడేజా, విహారి పోటోలను జతచేశాడు. ఇప్పుడు కూడా జట్టుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని వీరూ చెప్పకనే చెప్పాడు.

 గాయపడ్డ ఆటగాళ్ల లిస్ట్:

గాయపడ్డ ఆటగాళ్ల లిస్ట్:

1-భువనేశ్వర్ కుమార్

2-ఇషాంత్ శర్మ

3-మహ్మద్ షమీ

4-ఉమేశ్ యాదవ్

5-కేఎల్ రాహుల్

6-రవీంద్ర జడేజా

7-హనుమ విహారి

8-జ‌స్‌ప్రీత్ బుమ్రా

ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన పంత్‌, జడేజా.. కోహ్లీని అధిగమించిన స్మిత్.. అగ్రస్థానం ఎవరిదంటే?

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Tuesday, January 12, 2021, 19:28 [IST]
Other articles published on Jan 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X