Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2021: 'ప్రపంచకప్‌లో హార్దిక్ పాండ్యా కీలకం.. అలాంటి ఆటగాడు ఎల్లప్పుడూ నా జట్టులో ఉంటాడు'

Virender Sehwag says Hardik Pandya Should Play as only Batsman in T20 World Cup 2021

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా చాలా కీలకం అని భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. జట్టులో అతడు కీలక పాత్ర పోషిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. పాండ్యా మొదట బ్యాట్స్‌మన్‌ అనే విషయాన్ని ముందు మనం గుర్తుపెట్టుకోవాలని వీరూ సూచించాడు. ఐపీఎల్ 2020 ముందు హార్దిక్‌ వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆపై కొంతకాలం పాటు జట్టుకు దూరమయ్యాడు. అయితే జట్టులోకి వచ్చినా.. బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ తరఫున కూడా బౌలింగ్‌ చేయడం లేదు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ స్పందించాడు.

తాజాగా క్రిక్‌బజ్‌తో వీరేంద్ర సెహ్వాగ్ మాటాడుతూ హార్దిక్ పాండ్యా ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడని, కాబట్టి టీ20 ప్రపంచకప్‌ 2021లో అతడు పూర్తిస్థాయి బ్యాటర్‌గా ఆడాలని చెప్పాడు. హార్దిక్ తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగలడని పేర్కొన్నాడు. 'హార్దిక్ పాండ్యా ముందుగా ఓ బ్యాట్స్‌మన్‌ అనే విషయం గుర్తుంచుకోవాలి. బౌలింగ్‌ చేయడం అనేది కేవలం బోనస్ మాత్రమే. వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకున్న కారణంగా ఇప్పటికీ బౌలింగ్‌ చేయడానికి ఫిట్‌గా లేడు. బ్యాట్‌తో మ్యాచ్‌లను గెలిపించగలడు. టీ20 ప్రపంచకప్‌లో పూర్తిస్థాయి బ్యాటర్‌గా హార్దిక్ బరిలోకి దిగాలి. అలాంటి ఆటగాడు ఎల్లప్పుడూ నా జట్టులో ఉంటాడు' అని వీరూ అన్నాడు.

భారత మాజీ క్రికెటర్ అజయ్‌ జడేజా కూడా హార్దిక్ పాండ్యా గురించి మాట్లాడాడు. 'హార్దిక్‌ పాండ్యాను ముందుగా ఓ బ్యాట్స్‌మన్‌గా చూడాలి. బ్యాట్స్‌మెన్‌ ఎదగాలంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు పంపించాలి. ప్రస్తుతం హార్దిక్ ముందుగా వచ్చి నిరూపించుకున్నాడు. మధ్య ఓవర్లలో చాలా బాగా ఆడగల నైపుణ్యం అతడికి ఉంది. ముంబై ఇండియన్స్‌ హార్దిక్ బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుగా పంపించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. హార్దిక్ మంచి ఆటగాడు. అతడికి ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి' అని అజయ్‌ జడేజా పేర్కొన్నాడు.

ప్రస్తుతం హార్దిక్‌ పాండ్యా ఐపీఎల్ 2021 ఆడుతున్నాడు. ఈ టోర్నీలో అతడు ముంబై ఇండియన్స్ తరఫున ఆశించిన మేర రాణించట్లేదు. అయితే మంగళవారం రాత్రి పంజాబ్‌ కింగ్స్‌తో తలపడిన మ్యాచ్‌లో మాత్రం (30 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 నాటౌట్) పరుగులు చేశాడు. దాంతో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ముంబై ఈ మ్యాచ్‌కు ముందు వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయి పాయింట్లపట్టికలో వెనుకంజలో పడింది. పంజాబ్‌పై గెలుపొంది మళ్లీ ఐదులోకి వచ్చింది. ముంబై 11 మ్యాచులు ఆడి 5 విజయాలతో 10 పాయింట్లను ఖాతాలో వేసుకుంది.

Story first published: Thursday, September 30, 2021, 18:38 [IST]
Other articles published on Sep 30, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+