డేవిడ్ వార్నర్ వేస్ట్.. సన్‌రైజర్స్ సారథ్య బాధ్యతలు కేన్ విలియమ్సన్‌కు ఇవ్వాలి: వీరేంద్ర సెహ్వాగ్

IPL 2021 : SRH Captaincy కేన్ కు ఇవ్వడం మంచిది Sehwag Criticised Warner || Oneindia Telugu

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో అటు కెప్టెన్‌గా ఇటు బ్యాట్స్‌మెన్‌గా సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సారథి డేవిడ్ వార్నర్‌పై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. కెప్టెన్‌గా డేవివార్నర్ విఫలమవుతున్నాడని, టీమ్ సారథ్య బాథ్యతలను కేన్ విలియమ్సన్‌కు ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డాడు. చెన్నైసూపర్ కింగ్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్లతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్(57 బంతుల్లో 55) స్లో బ్యాటింగ్ టీమ్ విజయవకాశాలను దెబ్బతీసింది. మ్యాచ్ అనంతరం క్రిక్‌బజ్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్నర్ బ్యాటింగ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై అతను మరింత స్వేచ్చగా ఆడాల్సిందన్నాడు.

 స్వేచ్చగా ఆడాల్సింది..

స్వేచ్చగా ఆడాల్సింది..

‘బ్యాటింగ్ చేసేటప్పుడు డేవిడ్ వార్నర్ ఆలోచన విధానం చాలా చెత్తగా ఉంది. ఎవరూ కూడా అతను ఇంత నెమ్మదిగా ఆడుతాడని ఊహించలేదు. అతని బ్యాటింగ్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. వార్నర్ ఎలాంటి సంకోచం లేకుండా చాలా స్వేచ్చగా ఆడాల్సింది. వికెట్ చాలా బాగుతుంది. బంతి ముద్దుగా బ్యాట్‌పైకి వస్తుంది. మనీష్ పాండే 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేస్తే వార్నర్ మాత్రం బంతికో పరుగు అన్న విధంగా ఆడుతూ హాఫ్ సెంచరీ చేశాడు. అతను మరిన్ని పరుగులు చేసి ఉండాల్సింది.'అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో వార్నర్ 110.2 స్ట్రైక్‌రేట్‌తో 193 రన్స్ చేశాడు. ఇప్పుడు అదే సన్‌రైజర్స్ టీమ్‌ను కలవరపాటుకు గురిచేస్తోంది.

 కెన్‌ను కెప్టెన్ చేయాలి..

కెన్‌ను కెప్టెన్ చేయాలి..

ఇక డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై కూడా సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. సీఎస్‌కేతో మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లు రాబట్టే విషయంలో కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ విఫలమయ్యాడని తెలిపాడు. వార్నర్ కెప్టెన్సీపై వేటు వేసి కేన్ విలియమ్సన్‌ను సారథిగా నియమించుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సూచించాడు. ‘ఓ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కు ఏ మాత్రం రేటింగ్ ఇవ్వను. సీజన్ ఆరంభంలో కెప్టెన్‌గా అద్భుతం చేసిన వార్నర్.. సీఎస్‌కేతో మ్యాచ్‌లో మాత్రం విఫలమయ్యాడు. కేన్ విలియమ్సనే కెప్టెన్‌గా ఉంటే అతను ఏదో ఒకటి విభిన్నంగా చేసేవాడు. ఎందుకంటే వికెట్లు తీయకుంటే మ్యాచ్ గెలవమనే విషయం అతనికి తెలుసు.'అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

 ఫ్యాన్స్ కూడా..

ఫ్యాన్స్ కూడా..

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు కూడా డేవిడ్ వార్నర్ ఆట తీరు, సారథ్యం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. ఢిల్లీతో గత మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో సన్‌రైజర్స్ ఓటమికి కారణం డేవిడ్ వార్నరే అనే మంట మీదున్న వారికి తాజా మ్యాచ్‌లో అతని స్లో బ్యాటింగ్ పుండు మీద కారం చల్లినట్లయింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓటమికి వార్నరే కారణమని సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ క్రమంలోనే అతని కెప్టెన్సీపై వేటు వేసి కేన్ విలియమ్సన్‌కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒకటి గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పాయింట్స్ పట్టికలో చిట్ట చివర నిలిచింది. దీన్ని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు.

 నాదే బాధ్యత..

నాదే బాధ్యత..

సీఎస్‌కేతో ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని మ్యాచ్ అనంతరం డేవిడ్ వార్నర్ తెలిపాడు. ‘ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే. నా స్లో బ్యాటింగే జట్టు ఓటమికి కారణమైంది. నేను ఫీల్డర్స్ చేతుల్లోకి షాట్లు ఆడాను. మరోవైపు మనీష్ పాండే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కేన్ విలియమ్సన్, కేదార్ జాదవ్ ధాటైన ఇన్నింగ్స్‌లతో మాకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. కానీ ఎండ్ ఆఫ్ ద డే మాకు ఓటమి తప్పలేదు. దీనికి పూర్తి బాధ్యత నాదే. వాస్తవానికి నేను ఆడిన ఓ 15 సూపర్ షాట్స్‌ను ఫీల్డర్లు అద్భుతంగా అడ్డుకున్నారు. దాంతో నేను అసహనానికి గురయ్యాను. ఎక్కువ బాల్స్ ఆడాల్సి వచ్చింది. 170 పరుగులు మంచి స్కోరే. కానీ పవర్ ప్లేలో వికెట్లు తీయలేకపోయాం. దాంతో కమ్ బ్యాక్ చేయలేకపోయాం. ఇలాంటి వికెట్స్‌పై పవర్ ప్లే సహకారం లేకుండా గేమ్‌లో నిలవడం చాలా కష్టం.'అని వార్నర్ చెప్పుకొచ్చాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, April 29, 2021, 15:30 [IST]
Other articles published on Apr 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X