Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లి కలకాలం చేసుకునే వేడుక: భార్య ట్వీట్‌కు రిప్లై ఇచ్చిన సెహ్వాగ్

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్ కింగ్‌గా పేరొందిన సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ట్వీట్లు చేస్తూ అభిమానులను అలరించే వీరేంద్ర సెహ్వాగ్‌ శనివారం (ఏప్రిల్ 22) తన 14వ పెళ్లిరోజు జరుపుకొంటున్నారు.

ఈ సందర్భంగా సెహ్వాగ్ భార్య ఆర్తీ ట్విటర్‌ ద్వారా తన భర్తకి శుభాకాంక్షలు తెలిపారు. 'ఓ అద్భుతమైన వ్యక్తితో 13 ఏళ్లు ఆనందంగా కలిసున్నాను. నా జీవితంలో ప్రేమ, సంతోషం నింపినందుకు థ్యాంక్యూ వీరూ. భవిష్యత్‌లోనూ మనకి ఇలాంటి మంచి రోజులే కొనసాగాలని ఆశిస్తున్నాను' అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Virender sehwag says Anniversary is a momentary celebration, but our marriage is a timeless celebration

దీనికి సెహ్వాగ్ ట్వట్టర్‌లో 'మ్యారేజీ వార్షికోత్సవం అనేది జ్ఞాపకంగా చేసుకునే ఓ వేడుక. కానీ మా పెళ్లి కలకాలం చేసుకునే వేడుకలాంటిది. నాకు జీవితంలో అన్నీ ఇచ్చినందుకు థ్యాంక్యూ ఆర్తి' అని ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే సెహ్వాగ్ పెళ్లి రోజు సందర్భంగా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+