Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నాలో దాగున్న సీక్రెట్ బ్యాటింగ్‌ పాట్నర్ ఆయనే: సెహ్వాగ్

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్‌ను ఆస్వాదించడంలో సెహ్వాగ్ స్టైలే వేరు. ఆడతూ, పాడుతూ ఎంతో చలాకీగా బ్యాటింగ్‌ చేస్తాడు.

Virender Sehwag salutes his 'secret batting partner' Kishore Kumar on his birth anniversary

బ్యాటింగ్‌ చేసేటప్పుడు పాటలు పాడటం తనకి అలవాటని గతంలో సెహ్వాగ్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం తనలో దాగున్న బ్యాటింగ్‌ భాగస్వామిని గుర్తు చేసుకున్నాడు. శుక్రవారం బాలీవుడ్‌ ప్రముఖ సింగర్ కిశోర్‌ కుమార్‌ 86వ జయంతి.

సెహ్వాగ్‌ బ్యాటింగ్‌ చేసేటప్పుడు ఆయన పాటలే ఎక్కువ హమ్మింగ్‌ చేస్తుండేవాడు. ఇదే విషయాన్ని సెహ్వాగ్ ఎన్నో సార్లు చెప్పాడు కూడా. శుక్రవారం ఆయన పుట్టినరోజుని పురస్కరించుకుని 'ఆయన జయంతి రోజున, నాలో దాగున్న నా బ్యాటింగ్‌ భాగస్వామి కిశోర్‌ కుమార్‌ను గుర్తుచేసుకుంటున్నా' అని సెహ్వాగ్ ట్వీట్‌ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+