Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఏదో ఒకరోజు గంగూలీ పశ్చిమ బెంగాల్‌ సీఎం అవుతాడు:సెహ్వాగ్

Ganguly Will Become West Bengal Chief Minister : Virender Sehwag || Oneindia Telugu
Virender Sehwag said I knew that Ganguly could become the BCCI President, even the CM of West Bengal

ఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఏదో ఒకరోజు పశ్చిమ బెంగాల్‌ సీఎం అవుతాడు అని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ ధీమా వ్యక్తం చేశారు. గంగూలీకి రెండు కీలకమైన పదవులు లభిస్తాయని 2007లోనే ఊహించానని.. అందులో ఒకటి నిజమైందని, రెండోది కూడా త్వరలో నిజం అవుతుందనే నమ్మకం ఉందని సెహ్వాగ్‌ అన్నారు. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అవుతాడని ప్రకటించినప్పటి నుండి పశ్చిమ బెంగాల్ సీఎం అవుతాడని కూడా వార్తలు చెక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

పునరాగమణ సిరీస్‌:

పునరాగమణ సిరీస్‌:

తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న సెహ్వాగ్‌.. గంగూలీ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. '2007లో సౌతాఫ్రికా పర్యటన జరుగుతోంది. అది కేప్‌టౌన్‌లో మూడో టెస్ట్‌. ఓపెనింగ్ చేసిన నేను, వసీం జాఫర్‌ త్వరగా అవుటయ్యాం. నాలుగో నెంబర్‌లో సచిన్‌ బదులు దాదా బరిలోకి దిగాడు. అది అతడికి పునరాగమణ సిరీస్‌. సహజంగా ఎంతో ఒత్తిడి ఉంటుంది. కానీ ఒత్తిడిని అధిగమించి అద్భుతమైన బ్యాటింగ్‌ చేయడం తనకే సాధ్యమవుతుందని నిరూపించాడు' అని సెహ్వాగ్‌ అన్నారు.

పశ్చిమ బెంగాల్‌ సీఎం అవుతాడు:

పశ్చిమ బెంగాల్‌ సీఎం అవుతాడు:

'ఆ రోజు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఓ చర్చ జరిగింది. జట్టు ఆటగాళ్లలో ఎవరికైనా బీసీసీఐ అధ్యక్షుడు అయ్యే సత్తా ఉందంటే అది దాదాకే అని మేమంతా అనుకున్నాం. అంతేకాదు.. పశ్చిమబెంగాల్‌ సీఎం అవుతాడని కూడా నేను చెప్పా. నా మాటలలో ఒకటి నిజమైంది. మరొకటి బాకీ ఉంది. అది కూడా త్వరలోనే నెరవేరబోతోంది అని నేను అనుకుంటున్నా' అని సెహ్వాగ్‌ పేర్కొన్నారు.

ఓపెనర్‌గా బరిలోకి దిగు:

ఓపెనర్‌గా బరిలోకి దిగు:

'టాప్‌ ఆర్డర్‌లో నేను బ్యాటింగ్‌ చేయడానికి ప్రధాన కారణం దాదా. ఓసారి దాదా నా దగ్గరికి వచ్చి ఓపెనింగ్ చేస్తావా అని అడిగాడు. ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. అయినా సాధారణంగా సమాధానం ఇచ్చా. నువ్వు ఓపెనర్‌గా ఎందుకు బరిలోకి దిగకూడదు?. ఓపెనర్ స్థానం ఖాళీగా ఉంది. సచిన్ టెండూల్కర్ కూడా ఓపెనింగ్ చేస్తాడు' అని చెప్పారు.

నువ్వెంతో నిరూపించుకో:

నువ్వెంతో నిరూపించుకో:

'మిడిల్‌ఆర్డర్‌లో ఆడాలని నువ్వు అనుకుంటే.. జట్టులోని ఇతర ఆటగాళ్లకు గాయమయ్యే వరకు జట్టులో స్థానం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. మూడు నుంచి నాలుగు ఇన్నింగ్స్‌ల వరకు ఓపెనర్‌గా అవకాశం ఇస్తా. నువ్వెంతో నిరూపించుకో. ఒకవేళ విఫలమైతే మిడిలార్డర్‌లో ఆడు' అని దాదా అన్నారు. 'దాదా మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఆటగాడిపై కెప్టెన్ ఉంచే నమ్మకానికి ఇదే నిదర్శనం. నేను ఈ స్థానంలో ఉన్నానంటే దానికి కారణం దాదానే' అని సెహ్వాగ్‌ అన్నారు.

Story first published: Tuesday, October 29, 2019, 10:09 [IST]
Other articles published on Oct 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+