ఆస్టన్ అగర్ ప్రపంచ అత్యుత్తమ జట్టు.. ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు!!

లండన్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. సాధారణ సమయంలో కూడా ప్రకటిస్తారనుకోండి. తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు ఆస్టన్ అగర్ కూడా ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించాడు.

ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు:
బుధవారం లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ యూట్యూబ్ ఛానెల్‌లో ఆస్టన్ అగర్ తన ప్రపంచ అత్యుత్తమ క్రికెట్ జట్టును ప్రకటించాడు. అగర్ తన జట్టులో ఇద్దరు భారత ఆటగాళ్లకు చోటు ఇచ్చాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, విధ్వంసక ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ భారత్ నుంచి చోటు దక్కించుకున్నారు. వీరూ తనకిష్టమైన ఆటగాడని పేర్కొన్న ఆగర్.. సెహ్వాగ్ ఆడుతుంటే చూడటం తనకెంతో ఇష్టమని అన్నాడు. అగర్ జట్టులో ఆసీస్ క్రికెటర్లు ఎక్కువగా ఉన్నారు. వెస్టిండీస్ నుండి ఇద్దరు ఉండగా..శ్రీలంక, పాకిస్తాన్ జట్టులో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

ఓపెనర్‌గా సెహ్వాగ్:
వీరూను ఒక ఓపెనర్‌గా ఎంచుకున్న ఆసీస్ స్పిన్నర్ అగర్.. మరో ఓపెనర్‌గా జస్టిన్ లాంగర్‌కు అవకాశమిచ్చాడు. ఇక మూడో స్థానం కోసం ఎంపిక చేసిన రికీ పాంటింగ్‌కు జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. నాలుగో స్థానంలో సచిన్ టెండూల్కర్.. ఆ తర్వాత విండీస్ దిగ్గజాలు బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్‌ను ఎంపిక చేశాడు. ఇక వికెట్ కీపర్‌గా ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఎంపికయ్యాడు.

హెరాత్ ప్రపంచ స్థాయి స్పిన్నర్:
బౌలింగ్ విభాగంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్‌తో పాటు ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీని ఎంచుకున్నాడు. స్పిన్ విభాగంలో ఆసీస్ గ్రేట్ షేన్ వార్న్‌తో పాటు లంక స్పిన్నర్ రంగనా హెరాత్‌కు అవకాశమిచ్చాడు. ముత్తయ్య మురళీధరన్ కారణంగానే హెరాత్ ప్రతిభ ఎక్కువ వెలుగులోకి రాలేదని.. అయినప్పటికీ రంగానా హెరాత్ ప్రపంచ స్థాయి స్పిన్నర్ అని కొనియాడాడు.

ఆగర్ ప్రపంచ జట్టు:
వీరేంద్ర సెహ్వాగ్, జస్టిన్ లాంగర్, రికీ పాంటింగ్, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, వివ్ రిచర్డ్స్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, బ్రెట్ లీ, షేన్ వార్న్, షోయబ్ అక్తర్, రంగనా హెరాత్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications