For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్‌కు వీడ్కోలు: 'బోర్డు పరీక్షలు క్రికెట్‌ మ్యాచ్‌ల్లాంటివి'

By Nageshwara Rao

హైదరాబాద్: మార్చి నెల వచ్చిందంటే చాలు విద్యార్ధులకు పరీక్షా సమయం. దీంతో విద్యార్ధులకు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ సలహా ఇచ్చాడు. పరీక్షల సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని సూచిస్తూ తన ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు.

'బోర్డు పరీక్షలు క్రికెట్‌ మ్యాచ్‌ల్లాంటివి. నేనెప్పుడూ ఒత్తిడితో ఆడలేదు. అలాగే మీరూ ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి' అని ట్వీట్‌ చేస్తూ 'రిలీజ్‌ ద ప్రెజర్‌' అని హ్యాష్‌ట్యాగ్‌ ఇచ్చాడు. మిరిందా సంస్థ 'రిలీజ్‌ ది ప్రెజర్‌' పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సెహ్వాగ్ ఈ పోస్టు పెట్టాడు.

విరాట్‌కు వీడ్కోలు: భారత నావికాదళానికి 30 సంత్సరాల పాటు విశేష సేవలందించి సోమవారం రిటైర్ అవుతున్న ఐఎన్‌ఎస్‌ విరాట్‌ యుద్ధనౌకకు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు.

'విరాట్‌ రిటైరవుతోంది. పాత నౌకలు ఎప్పటికీ చచ్చిపోవు. వాటి స్ఫూర్తి కొనసాగుతుంది. విరాట్‌ భారత నేవీకి దాదాపు 30సంవత్సరాలు సేవలందించింది. ఈ సందర్భంగా ఇవే నా శుభాకాంక్షలు' అంటూ ట్విటర్‌లో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విరాట్ ఫోటోను కూడా సెహ్వాగ్ పోస్టు చేశాడు.

విరాట్ ప్రత్యేకలు:
1987 మే 2న ఐఎన్‌ఎస్‌ విరాట్‌ భారత నేవీలో చేరింది. ప్రపంచంలోనే అతి ప్రాచీన యుద్ధ నౌక ఇది. దేశంలో నిర్వహించిన అన్ని మేజర్ ఆపరేషన్లలో విరాట్ పాల్గొంది. విరా‌ట్‌ను 1959లో బ్రిటీష్ రాయల్ నేవీ కోసం తయారు చేశారు. ఆ సమయంలో ఫాక్లాండ్ యుద్ధంలో విజయం సాధించడంతో విరాట్‌ సేవలకు గొప్ప పేరు వచ్చింది.

మూడు దశాబ్ధాలుగా సేవ: ఎన్నో ప్రత్యేకతల 'విరాట్' రిటైర్మెంట్ నేడే

విరాట్ 743 అడుగుల పొడవు, 160 అడుగుల వెడల్పు, 29 అడుగుల ఎత్తు ఉంటుంది. 16సీ హ్యారియస్ జెట్స్, 4సీ కింగ్ కాప్టర్స్, 2చేతక్ చాపర్స్, 4 ధృవ చాప్టర్స్‌ను నిలిపే సామర్థ్యం విరాట్ సొంతం. నేవీ నుంచి పదవీ విరమణ పొందుతున్న రెండో నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌. దీనికి ముందు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ నావికాదళం నుంచి పదవీ విరమణ పొందింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+