కాశ్మీరి వ్యక్తిని జీపు బానెట్‌కు కట్టిన ఆర్మీ ఆఫీసర్‌కు సెహ్వాగ్ ప్రశంస
హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మేజర్ నితిన్ గొగోయ్‌కు ట్విట్టర్‌లో అభినందనలు తెలిపాడు. ఇంతకీ ఎవరీ మేజర్ నితిన్ గొగోయ్. కాశ్మీర్‌లో రాళ్లదాడికి పాల్పడుతున్న ఆందోళనకారుల్లో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానవ కవచంగా జీపు బానెట్‌కు కట్టి ప్రశంసా పత్రాన్ని పొందిన వ్యక్తి.

ఏప్రిల్ 9న శ్రీనగర్ లోక్‌సభ ఉప ఎన్నిక సమయంలో నిరసనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఆ సయమంలో మేజర్ గొగోయ్ అప్పటికప్పుడు ఓ కాశ్మీరిని జీపు బానెట్‌కు కట్టి ఆందోళన కారుల నుంచి బయటపడేందుకు, పరిస్థితిని సర్దుమణిగేలా చేశారు.
దీంతో నిరసనకారులు రాళ్లు రువ్వడం ఆపేశారు. దీంతో ఆ మార్గంలో సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, వారి వాహనాలు ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందుకి వెళ్లాయి. మేజర్ తీసుకున్న నిర్ణయాన్ని భారత ఆర్మీ చీఫ్ ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ కూడా సమర్ధించారు.
అంతేకాదు నితిన్‌కు కమెండేషన్ కార్డు మెడల్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో స్పందించారు. 'కమెండేషన్ కార్డు మెడల్ పొందిన మేజర్ నితిన్ గొగోయ్‌కు అభినందనలు. మన సైనికులను కాపాడేందుకు, గొప్పగా విధులు నిర్వర్తించేలా ఎంతో గొప్పగా కృషి చేశారు' అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications