Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ట్విట్టర్ యుద్ధానికి తెర: ఎంత పని చేశావయ్యా సెహ్వాగ్!

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటూ క్రికెట్, క్రికెటేతర అంశాలపై కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో స్పందిస్తున్న సంగతి తెలిసిందే.

ఆదివారం ట్విట్టర్ వేదికగా పూణె టెస్టులో టీమిండియా ఓటమిపై స్పందించిన సెహ్వాగ్, తాజాగా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్ధిని, కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్‌మెహర్ కౌర్‌ పోస్టుకు సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. ఢిల్లీలోని రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్‌మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టు దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్‌మెహర్, తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్‌బుక్‌లో కామెంట్ పోస్టు చేశారు. అంతేకాదు కార్గిల్ యుద్ధంలో తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధం చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె తన ఫేస్ బుక్ కవర్ పిక్‌గా పెట్టుకుని వార్తల్లో నిలిచింది.

దీంతో గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సెహ్వాగ్ అదే తరహాలో ఓ ట్వీట్‌ని పోస్టు చేశాడు. అందులో సెహ్వాగ్ 'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అనే ప్లకార్డుని పట్టుకుని ఉన్నాడు. సెహ్వాగ్ పోస్టు చేసిన ఈ ట్వీట్‌పై చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఇందులో పలువురు సెలబ్రిటీలతో పాటు రచయితలు కూడా ఉన్నారు.

సెహ్వాగ్ ట్వీట్‌ని కొందరు సమర్థించగా.. మరికొందరు మాత్రం కార్గిల్ అమరవీరుడు కుమార్తె పట్ల సెహ్వాగ్ ప్రవర్తించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

సెహ్వాగ్ పోస్టు చేసిన ట్వీట్

'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అనే ప్లకార్డుని సెహ్వాగ్ పట్టుకుని ఉన్నాడు.

బాలీవుడ్ హీరో రణదీప్ హుడా స్పందన సెహ్వాగ్ పోస్టు చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ హీరో రణదీప్ హుడా ఇలా స్పందించాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచాడు.

సెహ్వాగ్ పోస్టు చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ హీరో రణదీప్ హుడా ఇలా స్పందించాడు. సెహ్వాగ్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచాడు.

శేఖర్ గుప్తా

కార్గిల్ అమరవీరుడు కెప్టెన్ మణ్ దీప్ సింగ్ కుమార్తె గుర్‌మెహర్ కౌర్‌ పోస్టుకు సెహ్వాగ్ స్పందించిన తీరుపై వెటరన్ జర్నలిస్ట్ తీవ్రంగా మండిపడ్డారు.

ట్విట్టర్ యుద్ధానికి తెర: ఎంత పని చేశావయ్యా సెహ్వాగ్!

'మాక్ క్యాంపెయిన్' పై సీనియర్ జర్నలిస్ట్ బర్కా దత్ స్పందన

తన ఆలోచలను ధైర్యంగా చెప్పిన ఓ అమ్మాయి పట్ల టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ఈ 'మాక్ క్యాంపెయిన్' పై సీనియర్ జర్నలిస్ట్ బర్కా దత్ మండిపడ్డారు.

సెహ్వాగ్ తీరుపై మండిపడ్డ ఓ అభిమాని

గుర్‌మెహర్ కౌర్‌ పోస్టుకు వ్యంగ్యంగా స్పందించిన సెహ్వాగ్ తీరుపై ఓ అభిమాని తీవ్రంగా మండిపడ్డాడు.

సెహ్వాగ్ తీరుపై మండిపడ్డ అభినవ్ అగర్వాల్

గుర్‌మెహర్ కౌర్‌ పోస్టుకు వ్యంగ్యంగా స్పందించిన సెహ్వాగ్ తీరుపై అభినవ్ అగర్వాల్ అనే ఓ అభిమాని తీవ్రంగా మండిపడ్డాడు.

సెహ్వాగ్‌కు మద్దతుగా నిలిచిన ఓ అభిమాని

గుర్‌మెహర్ కౌర్‌ పోస్టుకు వ్యంగ్యంగా స్పందించిన సెహ్వాగ్ తీరుపై శ్వేతా సింగ్ అనే ఓ అభిమాని మద్దతుగా నిలిచింది.

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+