బెంగుళూరు: టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు. వన్డే మ్యాచ్‌ల్లో ఒక డబుల్ సెంచరీ. వన్డేల్లో స్ట్రయిక్ రేట్ 100. ఇదీ అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ గణాంకాలు.
అక్టోబర్ 20న వీరేంద్ర సెహ్వాగ్ తన 37వ పుట్టిన రోజునే అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు.

'ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తోపాటు అంతర్జాతీయ అన్ని ఫార్మాట్లకు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది' అని సెహ్వాగ్ మంగళవారం మధ్యాహ్నం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీరేంద్ర సెహ్వాగ్ పలు అవార్డులను కూడా దక్కించుకున్నారు.
* సెహ్వాగ్ ప్రతిభను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2010లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.
* 2002లో అర్జున అవార్డు
* 2008, 2009 సంవత్సరాల్లో విజ్డెన్ లీడింగ్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్ అవార్డు
* ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-2010
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్ గణాంకాలను ఒకసారి చూద్దాం:
టెస్టు అరంగేట్రం: Vs South Africa in Bloemfontein, November, 2001
వన్డే అరంగేట్రం: Vs Pakistan in Mohali, April, 1999
టీ20 అరంగేట్రం: Vs South Africa in Johannesburg, December, 2005
0 - T20I wickets
1 - Double century in ODIs and also one 5-wicket haul in Tests
2 - Triple centuries in Test cricket
14 - Scores of 150+ in Test cricket
15 - Hundreds in ODIs
19 - Played in T20Is
23 - Centuries in Tests
32 - Fifties in Tests
35.05 - Average in ODIs
37 - Age
38 - Fifties in ODIs
40 - Test wickets
49.34 - Average in Tests
82.23 - Strike rate in Tests
91 - Sixes in Tests
96 - ODI wickets
104 - Total number of Tests played

104.33 - Strike rate in ODIs
136 - Sixes in ODIs
219 - Highest score in ODIs
251 - Total number of ODIs
319 - Highest score in Tests
1,233 - Fours in Tests
1,132 - Fours in ODIs
8,273 - Total number of ODI runs
8,586 - Total number of Test runs