ప్రేమను బయటపెట్టాడు: భార్యకు సెహ్వాగ్ స్టైల్ ట్వీట్
హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ హ్యూమర్ ఎలాంటిదో మనకు తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో సెహ్వాగ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. కామెంటేటర్‌గా తనదైన శైలిలో సరదా ట్వీట్లతో అభిమానులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.

తన సహచర క్రికెటర్లకు తనదైన స్టైల్లో విషెస్ చెప్పడం సెహ్వాగ్‌కు అలవాటు. శుక్రవారం తన భార్య పుట్టినరోజు సందర్భంగా సెహ్వాగ్ తన ప్రేమను బయటపెట్టాడు. ఆమెపై తనకున్న అనురాగాన్ని తనదైన వ్యక్తం చేశాడు. నోట్ల రద్దుకు, ఆర్తి బర్త్ డేకు సెహ్వాగ్ లింకు పెట్టి ట్వీట్ చేశాడు.
ఇప్పుడు ఆ ట్వీట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'జన్మదిన శుభాకాంక్షలు బీవీజీ. డిసెంబర్ 16.. నీ పుట్టినతేదీతో ఇప్పటికే ఓ సినిమా ఉంది. సచ్చా ప్యార్.. సౌ కా నోట్ ముష్కిల్ సే మిల్తా హై (నిజమైన ప్రేమ, వంద నోటు అతి కష్టం మీద దొరుకుతుంది)' అని తనదైన స్టైల్లో సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ప్రస్తుతం నోట్ల రద్దుతో చిల్లర కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ట్విట్టర్ కింగ్‌గా పేరొందిన సెహ్వాగ్ స్టైల్ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంది. శుక్రవారం ఉదయం ఈ ట్వీట్ చేసినప్పటి నుంచి 5 వేలకుపైగా లైకులు రాగా.. 700కుపైగా రీట్వీట్స్, వందల కొద్దీ కామెంట్స్ వచ్చాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications