Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఎమిరేట్స్ పొరపాటు: సెహ్వాగ్ దిమ్మదిరిగే ట్వీట్

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ట్విట్టర్‌లో సెహ్వాగ్ రెండో ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన ట్వీట్‌లతో నెటిజన్లను ఎంతగానో అలరిస్తున్న సెహ్వాగ్ తాజాగా ఎమిరేట్స్ 247.కామ్(http://www.emirates247.com/) చేసిన చిన్నపాటి తప్పిదాన్ని ఎత్తి చూపాడు.

భారత క్రికెట్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి మహేంద్ర సింగ్ ధోని వైదొలగడమే సెహ్వాగ్ ట్వీట్‌కు ప్రధాన కారణమైంది. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న తర్వాత బీసీసీఐ కోహ్లీకి పగ్గాలు అప్పగించడాన్ని ఎమిరేట్స్ 247.కామ్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.

అయితే ఆ ట్వీట్‌లో ధోని స్థానంలో బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్‌పుత్ ఫోటోను పోస్ట్ చేసింది. 'ఎంఎస్ ధోని ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సుశాంత్ రాజ్‌పుత్ ఫోటోను కోహ్లీ పక్కన పెట్టి ట్వీట్ చేసింది. దీనిపై సెహ్వాగ్ తనదైన శైలిలో చమత్కారం చూపిస్తూ ట్వీట్ చేశాడు.

సెహ్వాగ్ చమత్కారపు ట్వీట్

'తనలాగే ఉన్న ఒక వ్యక్తి ఫొటోను షేర్‌ చేసి, తాను అప్పుడప్పుడూ విమానం ఎక్కుతుంటానని.. తన బదులు ఇతన్ని అనుమతించవద్దని' ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. అయితే ఈ ట్వీట్ పోస్టు చేసే సందర్భంలో సెహ్వాగ్ కూడా తప్పులో కాలేశాడు. ఎమిరేట్స్‌ అని కనిపించగానే అది ఎయిర్‌లైన్స్‌గా భావించి సెహ్వాగ్ ట్వీట్‌ పెట్టాడు.

సెహ్వాగ్ ట్వీట్‌పై సరదాగా స్పందించిన ఎమిరేట్‌ ఎయిర్‌లైన్స్‌

మరోవైపు ఎమిరేట్‌ ఎయిర్‌లైన్స్‌ సెహ్వాగ్ ట్వీట్‌పై సరదాగానే స్పందించింది.

ఆటపట్టించిన సెహ్వాగ్ ఫాలోవర్లు

అయితే వీరేంద్ర సెహ్వాగ్ పొరపాటు పడిన సంగతి గుర్తించి అతడి ఫాలోవర్లు ఆటపట్టించడం మొదలుపెట్టారు.

నువ్వు సూపర్ సెహ్వాగ్

పొరపాటుగా చేసిన సెహ్వగ్ ట్వీట్‌ని గుర్తించిన అతడి ఫాలోవర్లు ఆటపట్టించడం మొదలుపెట్టారు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+