
ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ
ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టిన కోహ్లీ.. సచిన్ టెండూల్కర్ సాధించిన 100 సెంచరీల రికార్డుని కూడా బద్దలు కొడతాడని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. మూడు ఫార్మాట్లు కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటికే 68 సెంచరీలు సాధించాడు. కోహ్లీకి చాలా కెరీర్ ఉన్నందున సచిన్ సెంచరీల రికార్డుని అధిగమించడం ఖాయం.

సచిన్ నెలకొల్పిన ఆ రికార్డుని
అయితే, సచిన్ నెలకొల్పిన ఓ రికార్డుని విరాట్ కోహ్లీ అధిగమించలేడని సెహ్వాగ్ తెలిపాడు. సెహ్వాగ్ మాట్లాడుతూ "అది ఎవ్వరూ బద్దలు కొట్టలేని చేయలేని రికార్డు. 200 టెస్టు మ్యాచ్‌ల సచిన్ రికార్డును అధిగమించడం ఈతరం క్రికెటర్ల వల్ల కాదు. దీని దరిదాపులకు కూడా ఎవరూ వస్తారని కూడా అనుకోవడం లేదు" అని సెహ్వాగ్ తెలిపాడు.

77 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ
ఇప్పటివరకు టీమిండియా తరుపున కోహ్లీ 77 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇక, వన్డేల్లో సచిన్ టెండూల్కర్ 49 సెంచరీలు చేయగా... విరాట్ కోహ్లీ 43 సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో సచిన్ వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టేందుకు ఎంతో సమయం పట్టదని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లలో ఎవరు గొప్ప?
కాగా విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్‌లలో ఎవరు గొప్ప బ్యాట్స్‌మన్? అన్న ప్రశ్నకు సెహ్వాగ్ తనదైన శైలిలో స్పందించాడు. "అతడే (విరాట్) అత్యుత్తమం, అవును స్మిత్ కన్నా కోహ్లీయే మెరుగైన ఆటగాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వీరిద్దరినీ మీరు చూస్తే స్మిత్ కన్నా కోహ్లీ ఆట చూడముచ్చటగా ఉంటుంది. ప్రపంచంలో అతడే నంబర్ వన్ బ్యాట్స్‌మన్" అని చెప్పాడు.


Click it and Unblock the Notifications
