
హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ 2011 వరల్డ్ కప్ సంగతులను గుర్తు చేసుకుంటున్నాడు. ఇటీవల ఆయన పాల్గొన్న 'క్రికెట్ కీ బాత్' అనే టీవీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడాడు. శ్రీలంకతో జరుగుతోన్న ఫైనల్ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పు జట్టు విజయానికి ఎలా కారణమైందో వివరించాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు దిగమని సచిన్ టెండూల్కర్ సూచించడంతోనే ధోనీ నాలుగో స్థానంలో ఆడేందుకు సిద్ధమైయ్యాడని పేర్కొన్నాడు.
అప్పటివరకూ గేమ్ అంతా మాదే అనుకుంటున్న శ్రీలంక జట్టుకు ధోనీ-గౌతం గంభీర్‌ల భాగస్వామ్యం లెక్కలన్నీ తారుమారు చేసింది. వారిద్దరి భాగస్వామ్యంలో 109 పరుగులు రాబట్టడంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపం మారిపోయి భారత్‌కు రెండో ప్రపంచ కప్ వచ్చేలా చేసింది.
' అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో.. సచిన్ టెండూల్కర్ జట్టుకు అవసరమైనప్పుడు దానికి తగిన వ్యక్తిని బరిలోకి దించాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అవసరమైనప్పుడు.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ను దించాలి. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అవసరమైనప్పుడు.. రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ను దించాలి.' అని సూచించడంతో నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీని తప్పించి ధోనీ బరిలోకి దిగాడు. అక్కడ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ అవసరం లేకపోవడంతో అస్సలు యువరాజ్ సింగ్ ఆలోచనే లేకుండా పోయింది.
ఈ మ్యాచ్‌లో ధోనీ(91)పరుగులు గౌతం గంభీర్ (97)పరుగులు చేసి అద్భుతమైన ప్రదర్శనతో జట్టును గెలిపించారు. ఈ మ్యాచ్‌లో నువాన్ కులశేఖరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. అలాంటి సమయంలో ఎలాంటి బ్యాట్స్‌మన్‌ను బరిలోకి దించాలో చెప్పడం చాలా గొప్ప విషయమని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ప్రత్యేకంగా శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ బౌలింగ్ వేస్తున్న సమయంలో పిచ్‌లో నిలవాలంటే సమతూకం కావాలి కదా!!