
హైదరాబాద్: ధోనీ రాక టీమిండియాకు బాగా కలిసొస్తుంది. దక్షిణాఫ్రికాలో జరగనున్న ఆరు వన్డేల సిరీస్‌కు ధోనీ ఆడనున్నాడు. ఈ నేపథ్యంలో భారత్ కు బాగా కలిసొస్తుందనే ఆశా భావాన్ని వీరేంద్ర సెహ్వాగ్ ఇలా వ్యక్తం చేశాడు.
టీమిండియా కెప్టెన్ కోహ్లీకి సలహాలు ఇచ్చేందుకు ఇప్పుడు ధోనీ ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో పొరబాట్లు జరిగిన విధంగా కాకుండా ప్రతి పొరబాటును సరిదిద్ధగలడు. ఈ వన్డే సిరీస్‌కు ధోనీ గ్రేట్ బెనిఫిట్. అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
మొదటి టెస్టు ఖచ్చితంగా గెలిచి తీరాలి. అలా కాని పరిస్థితుల్లో టీమిండియా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారత జట్టు పరిగణించాల్సిన విషయం ఏమంటే మొదటి మూడు వన్డేలకు సఫారీ జట్టులో డివిలియర్స్ కూడా అందుబాటులో ఉండకపోవడం. ఇది భారత్‌కు ఓ సదవకాశం.
దక్షిణాఫ్రికా జట్టుతో టెస్టు సిరీస్ ఆడిన భారత్ జట్టు 2-1 తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్ మొత్తంలో ఎంఎస్ ధోనీ ఆడలేదు. దీంతో మొదటి, రెండో టెస్టుల జట్టు కూర్పుపై, ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తాయి.
పట్టుదలతో కోహ్లీసేన మూడో టెస్టును క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం గెలిచి చూపించింది. ఈ టెస్టులో భారత్ గెలుపుకు కీలక పాత్ర పోషించిన బౌలర్లను వన్డే మ్యాచ్‌కు భారత్ ఎంపిక చేసుకుంది.
సౌతాఫ్రికా జట్టుపై రెండు జతల మూడు వన్డేల సిరీస్ ను గెలుచుకుని టెస్టు మ్యాచ్ లో కలిగిన పరాజయాన్ని అధిగమించాలని భారత్ జట్టు యోచిస్తోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.