స్వార్థంతో ఆడొద్దని సచిన్ తిట్టాడు, వెంటనే సెహ్వాగ్ అవుటయ్యాడు
ముంబై: డ్యాషింగ్ ఓపెనింగ్ జోడీగా వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌ల జోడీ మెరుపులు మెరిపించిన సమయంలో జరిగిన ఓ సంఘటనను సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.

సచిన్ తిడితే అవుటయ్యా
2011లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా సచిన్ తనను తిట్టాడని, తాను ఆ వెంటనే ఔట్ అయ్యానని సెహ్వాగ్ చెప్పాడు. ఓ మ్యాచ్‌లో తామిద్దరం ఓపెనింగ్ బ్యాటింగ్‌కు వచ్చామని, తొలి ఓవర్ సజావుగా సాగిందని సెహ్వాగ్ చెప్పాడు.

మాట్లాడాలని సచిన్ సైగ
మ్యాచ్ పైన శ్రద్ధ పెట్టడంలో విఫలమై జిడ్డు ఆడుతూ ముందుకు సాగామని సెహ్వాగ్ అన్నాడు. తాను ఆట మధ్యలో తనకు అలవాటైన ఓ పాటను పాడుతూ బ్యాటింగ్ చేస్తుండగా తనతో మాట్లాడాలని సైగ చేస్తూ దగ్గరకు రమ్మని సచిన్ పిలిచాడని చెప్పాడు.

స్వార్థంతో ఆడొద్దని సచిన్ ఆగ్రహం
తాను అలా పాట పాడుతూనే సచిన్ వద్దకు వెళ్లానని సెహ్వాగ్ చెప్పాడు. అప్పుడు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సచిన్, స్వార్థంతో మ్యాచ్ ఆడవద్దని గట్టిగా చెప్పాడని అన్నాడు.

ఏకాగ్రత చెదిరి ఔటయ్యా
దాదాపు ఐదు ఓవర్లు పరుగులు లేకుండా ముగియడంతోనే సచిన్‌కు కోపం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. ఆ ఘటనతో తనకు ఏకాగ్రత చెదిరి, తర్వాత ఓవర్ లోనే ఔట్ అయ్యానని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications