Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్యాటింగ్‌ చేస్తూ ఆ పాటే పాడేవాడిని: సెహ్వాగ్ ప్రత్యేక ట్వీట్

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ట్విట్టర్‌లో తనదైన శైలిలో ట్వీట్లతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. సెహ్వాగ్‌కు ఓ ప్ర‌త్యేకత ఉంది. మ్యాచ్ ఎలాంటి ప‌రిస్థితిలో ఉన్నా, బ్యాటింగ్ చేసేట‌ప్పుడు పాట పాడ‌టం.

జూన్‌ 27న ఆర్డీ బర్మన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌ తన ట్విటర్‌ ద్వారా సంగీత దర్శకుడి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తాను మైదానంలో బ్యాటింగ్‌ చేసే సమయంలో బర్మన్‌ సంగీతం అందించిన గోల్‌మాల్‌ చిత్రంలోని 'ఆనే వాలా పల్‌' మెలోడీ సాంగ్‌ను తరచూ ఆలపించేవాడిని అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు.

ఆర్డీ బ‌ర్మ‌న్‌ ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎస్డీ బ‌ర్మ‌న్ కుమారుడు. వెస్ట‌ర్న్ స్టైల్ మ్యూజిక్ కంపోజ్ చేయ‌డంలో ఆర్డీ బర్మన్‌ది అందెవేసిన చేయి. ఆర్డీ బ‌ర్మ‌న్‌.. క‌టి ప‌తంగ్‌, హ‌రే రామ హ‌రే క్రిష్ణ‌, కారావాన్‌, షోలే, యాదోంకీ బారాత్‌లాంటి హిట్ సినిమాల‌కు మ్యూజిక్ అందించాడు.

1994లో ఆర్డీ మ‌ర‌ణించాడు. ఆయన చివరి సినిమా 1942: ఎ ల‌వ్ స్టోరీ. ఇదిలా ఉంటే సెహ్వాగ్ టీమిండియా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. కోచ్‌ పదవి రేసులో సెహ్వాగ్‌‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు టామ్‌ మూడీ ముందంజలో ఉన్నారు.

గంగూలీ, లక్ష్మణ్‌, సచిన్‌తో కూడిన క్రికెట్‌ సలహా కమిటీ కోచ్ రేసులో ఉన్న అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. జులైలో కోహ్లీసేన శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనకు ముందే కోచ్‌ని ఎంపిక చేస్తామని బీసీసీఐ ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+