Sehwag : వార్నర్ అప్పట్లో గొడవ పడితే జట్టులోంచి తీసేసి ఇంటికి పంపించాం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. అతని గణాంకాలే అతని సత్తాను తెలియజేస్తాయి. ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన వార్నర్ ఓ అరుదైన ట్యాలెంటెడ్ ప్లేయర్. అతను హిట్టింగ్ చేయగలడు. అది కూడా కన్సిస్టెన్సీతో హిట్టింగ్ చేస్తూ పరుగులు రాబట్టగలడు. అతని కన్సిస్టెన్సీ చాలా ఆశ్చర్యపరుస్తుంటుంది. అతను ప్రస్తుతం ఐపీఎల్-2022 సీజన్లో కూడా సంచలన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు కీలకమైన ప్లేయర్‌లాగా మారాడు. వార్నర్ ఇప్పుడు ఐపీఎల్లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా పేర్కొంటున్నప్పటికీ గతంలో వార్నర్ చాలా అగ్రెసివ్ పర్సన్. ఈ ఆస్ట్రేలియన్ డేర్ అండ్ డ్యాషింగ్ ఓపెనర్ 2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. అతను ఆ సీజన్‌లో ఎక్కువ పరుగులు చేయలేదు. ఆ సీజన్‌లో వార్నర్ క్రమశిక్షణతో ఇబ్బంది పడ్డాడని, జట్టు మేనేజ్‌మెంట్‌కు ఇబ్బంది కలిగించాడని భారత మాజీ, డీసీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు.

కొత్తలో ఎప్పుడూ గొడవ పడేవాడు
వార్నర్ ఒకరిద్దరు డీసీ ఆటగాళ్లతో గొడవపడడంతో ఇంటికి పంపించేశామని సెహ్వాగ్ వెల్లడించాడు. 'నేను ఒకరిద్దరు ఆటగాళ్లపై నా అసహనాన్ని బయటపెట్టాను. డేవిడ్ వార్నర్ వారిలో ఒకడు. ఎందుకంటే అతను కొత్తగా చేరినప్పుడు, అతను ప్రాక్టీస్ లేదా మ్యాచ్‌లు ఆడటం కంటే ఎక్కువగా గొడవలు పడి విడిపోయేవాడు. అతను కొంతమంది ఆటగాళ్లతో గొడవ పడ్డాడు కాబట్టి మేము అతనిని చివరి రెండు మ్యాచ్‌లలో ఆడకుండా ఇంటికి పంపించాం.'అని క్రిక్‌బజ్‌లో సెహ్వాగ్ తెలిపాడు.

బుద్ధి చెప్పడానికే జట్టు నుంచి తీసేశాం
'కొన్నిసార్లు కొందరికి లెస్సన్ చెప్పడానికి వారిని దూరంగా ఉంచాల్సొస్తుంది. వార్నర్ అప్పట్లో కొత్త కాబట్టి టీమ్‌కి నువ్వు మాత్రమే ముఖ్యం కాదని, ఇతరులు కూడా ముఖ్యం అని అతనికి చూపించడం కోసమే అలా చేశాం. మేము అతనిని జట్టు నుండి తప్పించిన తర్వాత మేము చివరి మ్యాచ్ లలో గెలిచాం' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

హోం టీంలా భావించిన సన్‌రైజర్స్ జట్టుతోనూ విభేదాలే
ఇక వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మేనేజ్‌మెంట్ దారుణంగా అవమానించిన సంగతి తెలిసిందే. గత సీజన్ మధ్యలో అతన్ని కెప్టెన్‌గా తొలగించింది. కేన్ విలియమ్సన్‌కు జట్టు పగ్గాలు అప్పజెప్పింది. గత సంవత్సరం జట్టుతో విభేదాల వల్ల వార్నర్‌ను తొలుత ప్లేయింగ్ 11 నుంచి తొలగించిన సన్ రైజర్స్ యాజమాన్యం తర్వాత సీజన్ కోసం అతన్ని రిటైన్ చేసుకోకుండా వదులుకుంది. ఇక ఈ సీజన్లో ఈ 35 ఏళ్ల ఓపెనర్ ఢిల్లీ జట్టులోకి తిరిగి వచ్చాడు. మంచి ఫాంతో రన్స్ చేస్తున్నాడు.

ఐపీఎల్లో కన్సిస్టెన్సీ ప్లేయర్
వార్నర్ ఐపీఎల్లో అత్యంత కన్సిస్టెన్సీ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో మ్యాచుల్లో సన్ రైజర్స్ ను ఒంటిచేత్తో గెలిపించాడు. కెప్టెన్సీలోనూ తన మార్క్ చూపించాడు. 2016లో సన్ రైజర్స్ కు టైటిల్ కూడా అందించాడు. అలాగే 3సార్లు ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కు ఇచ్చే క్యాప్)ను అందుకున్నాడు. ఐపీఎల్లో మొత్తం 158మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 4 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీలతో 5805పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications