
హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) క్రికెట్ కమిటీకి రాజీనామా ప్రకటించారు. బోర్డు అవసరాలను దృష్టిలో ఉంచుకునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సెహ్వాగ్‌తో పాటుగా ఆకాశ్ చోప్రా, రాహుల్ సింగ్వీలు కూడా వారి రాజీనామాను ప్రకటించారు.
వీరు ముగ్గురు కలిసి బౌలింగ్ కోచ్‌గా మనోజ్ ప్రభాకర్‌ను రిటైన్ చేసుకోవాల్సిందిగా సూచించారట. దానికి బోర్డు అంగీకరించకపోవడంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డీడీసీఏ కథనం ప్రకారం.. సుప్రీం కోర్టు ఆదేశానుసారం మేనేజ్‌మెంట్‌లొ మార్పులు చేయాలని తలంచారట. ఈ క్రమంలోనే పానెల్‌లోని మెంబర్లలో మార్పులు చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు.
మనోజ్ ప్రభాకర్‌ను బౌలింగ్ కోచ్‌గా తీసుకోకపోవడంతోనే మీరు రాజీనామా చేస్తున్నారా.. అని సెహ్వాగ్‌ను అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పకనే చెప్పి అవుననే సమాధానం ఇచ్చారు. 'మేము ఢిల్లీ అండ్ డిస్ట్రిక్స్ క్రికెట్ అసోసియేషన్ వృద్ధి చెందేందుకు కమిటీగా ఎంతో కృషి చేశాం. మా సూచనలు.. సలహాలు పనికిరానప్పుడు డీడీసీఏలో మేం కొనసాగలేమనే నిర్ణయాన్ని అసోసియేషన్‌కు తెలియజేశాం. మా దైనందిక జీవితాల్లో బిజీగా ఉండడంతో మేం తప్పుకుంటున్నాం.' అని పేర్కొన్నాడు.
ఈ ప్రభాకర్ నియామకం విషయంలో గౌతం గంభీర్ సైతం విముఖత వ్యక్తం చేస్తున్నాడు. దీంతో సెహ్వాగ్... గంభీర్ ఇద్దరి మధ్య ఓ చిన్నపాటి యుద్దమే జరుగుతోంది. అతనొక మ్యాచ్ ఫిక్సర్ అని అతని తీసుకోకూడదంటూ గంభీర్ పట్టుపట్టాడు.