
నా భయం అంత అదే..
‘గిల్ సెంచరీ చేస్తే అతని ఆత్మవిశ్వాసం అమాంతం పెరిగేది. మావోడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ ఆకస్మాత్తుగా అలా శరీరానికి దూరంగా వెళ్లే బంతిని ఎందుకు వెంటాడాడో అర్థం కాలేదు. ఈ సిరీస్‌లో అతను ఆరు ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. క్రీజులో చాలా సౌకర్యంగా కనిపించాడు. కానీ అతను ఔటైన విధానం నన్ను ఆందోళనకు గురిచేస్తుంది. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్‌గా వేసిన బంతులను వెంటాడి మరి వికెట్ సమర్పించుకున్నాడు. నాకు తెలిసి ఈ విషయాన్ని ఇతర జట్లన్ని ఇప్పటికే గుర్తించి ఉంటాయి. ఈ బలహీనతను గిల్ త్వరగా తెలుసుకొని అధిగమిస్తాడని, మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయడని ఆశిస్తున్నా.'అని లాక్విందర్ చెప్పుకొచ్చాడు.

గిల్ కోసం వెయిటింగ్..
ఇక ఐపీఎల్ ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడంతో గత 6 నెలలుగా గిల్ తమకు దూరంగా ఉన్నాడని సీనియర్ గిల్ తెలిపాడు. కేవలం వీడియో కాల్స్, టీవీల్లోనే అతన్ని చూస్తున్నామన్నాడు. అతన్ని కలిసేందుకు ఉత్సాహంగా ఉన్నామన్నాడు. ‘గత 6 నెలలుగా గిల్ మాకు దూరంగా ఉన్నాడు. అతన్ని టీవీ, వీడియో కాల్స్‌లోనే చూశాం. గత 6 నెలలుగా అతను బయో బబుల్‌లోనే ఉంటున్నాడు. ఇక మా ఓపిక నశించింది. అతన్ని కలిసేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం'అని చెప్పుకొచ్చాడు.

సెంచరీ కంటే ఎక్కువ ..
ఇక గిల్ తండ్రి వ్యాఖ్యలపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా తనదైన శైలిలో స్పందించాడు. శుభ్‌మన్ తండ్రికి సంబంధించిన న్యూస్ క్లిప్‌ను షేర్ చేస్తూ..‘ఈ తల్లిదండ్రులు తల్లిదండ్రులే'అని సెటైరిక్‌గా కామెంట్ చేశాడు. అంతేకాకుండా గిల్ ఆడిన ఇన్నింగ్స్ సెంచరీ కంటే ఎక్కువని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. 91 పరగుల వద్ద నాథన్ లయన్ బౌలింగ్‌లో గిల్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.

సుంధర్ తండ్రి కూడా..
ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ తండ్రి ఎమ్ సుందర్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో తమ కొడుకు సెంచరీ చేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. వాస్తవానికి అతను బ్యాట్స్‌మెన్ అని, ఆ తర్వాతే స్పిన్నర్ అని చెప్పుకొచ్చాడు. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును సుందర్(62), శార్దుల్ ఠాకూర్(67) అద్భుత బ్యాటింగ్‌తో గట్టెక్కించిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు ఏకంగా ఏడో వికెట్‌కు 123 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను రేసులో నిలిపారు.
ICC Test Rankings: నాలుగుకు పడిపోయిన కోహ్లీ.. గబ్బా హీరో పంత్‌కు బెస్ట్ ర్యాంక్