ఆర్సీబీ ప్లేయర్‌పై సెహ్వాగ్ ప్రశంసల జల్లు, అతని రేంజ్ వేరే లెవెల్, రూ.15కోట్లు పెట్టి కొనాల్సిన ప్లేయర్

ఐపీఎల్ 2022 టైటిల్‌కు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) రెండు అడుగుల దూరంలో నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 14పరుగులతో అద్భుత విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. చివర్లో హర్షల్ పటేల్ సూపర్ బౌలింగ్‌తో ఆర్‌సీబీ భారీ లక్ష్యాన్ని కాపాడుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 207 పరుగులు చేసింది. రజత్ పటీదార్(54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ మూడు వికెట్లు తీయగా.. సిరాజ్, వానిందు హసరంగా, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు. హర్షల్ పటేల్, హజెల్ వుడ్ మ్యాచ్‌ను మలుపుతిప్పారు.

మార్కస్‌ను ఔట్ చేసి మలుపు తిప్పాడు..
చివరి మూడు ఓవర్లలో 40పరుగులు రావాల్సిన తరుణంలో హర్షల్ పటేల్ 18వ ఓవర్ తొలి బంతికి వైడ్ వేశాడు. ఇక తర్వాత బంతికి వైడ్ ప్లస్ ఫోర్ వచ్చింది. దీంతో సమీకరణం 18బంతుల్లో 35గా మారింది. క్రీజులో మార్కస్ స్టాయినిస్, లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఉన్నారు. ఇంత భారీ హిట్టర్లు ఉండడంతో ఈ సమీకరణం అంత పెద్ద కష్టమేమీ కాదు. అప్పుడే హర్షల్ పటేల్ మ్యాజిక్ చేశాడు. వరుసగా రెండు బంతులు మార్కస్ స్టాయినిస్ కు డాట్ వేసి హర్షల్ మూడో బంతికి ఊరించేలా బంతి వేశాడు. మార్కస్ హాఫ్ సైడ్లో షాట్ ఆడగా సిక్సర్ దిశగా వెళ్లింది. కానీ బౌండరీ వద్ద రజత్ పటీదార్ అద్భుత క్యాచ్ పట్టడంతో స్టోయినిస్ పెవిలియన్ చేరాడు. ఇది టర్నింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే స్టోయినిస్ ఎంతటి విధ్వంసకారుడో తెలిసిందే. తర్వాత 3బంతుల్లో కేవలం రెండు పరుగులే ఇచ్చాడు.

దెబ్బ తగిలినా ఓర్చుకుని మరీ బౌలింగ్ చేశాడు
ఇక చివరి ఓవర్లో 24పరుగులు కావాల్సిన తరుణంలో హర్షల్ కేవలం 9పరుగులే ఇచ్చి 14పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచేలా చేశాడు. అంతకుముందు 10వ ఓవర్, 12వ ఓవర్ వేసిన హర్షల్ ఆ రెండు ఓవర్లలో కేవలం 9పరుగులే ఇచ్చి లక్నోపై ప్రెషర్ పెరిగేలా చేశాడు. ఇకపోతే గ్రౌండ్లో ఫీల్డింగ్ సందర్భంగా ఓ బంతిని ఆపే క్రమంలో మహిపాల్ లోమ్రోర్, హర్షల్ పటేల్ ఢీకొనగా.. హర్షల్ పటేల్ పక్కటెముకల వద్ద కాస్త దెబ్బతగిలింది. కాసేపు గ్రౌండ్ వీడిన హర్షల్ తిరిగొచ్చి అసాధారణ ప్రదర్శనతో ఆర్సీబీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

నాలుగు ఓవర్ల కోటాలో 1/25 ప్రదర్శన
ఇరు జట్ల ప్లేయర్లు ఎటాకింగ్ గా ఆడిన ఈ మ్యాచ్‌లో హర్షల్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 1/25 ప్రదర్శనతో రాణించాడు. ఇక భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఎలిమినేటర్‌లో హర్షల్ పటేల్ అద్భుతమైన ప్రదర్శన పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అతని రేంజ్ రూ.10కోట్లు కాదని రూ.14-15కోట్ల ప్రైస్ ట్యాగ్ బౌలర్ అంటూ కొనియాడాడు.

అతనికి రూ.10కోట్లు కూడా తక్కువే
సెహ్వాగ్ మాట్లాడుతూ.. హర్షల్ పటేల్‌కు మెగావేలంలో పలికిన ధర చాలా తక్కువ. బెంగుళూరుకు అతను బౌలింగ్ చేస్తున్న విధానాన్ని బట్టి అతని రేంజ్ వేరే అనిపిస్తుంది. అతను జట్టు కోసం మ్యాచ్‌లను సేవ్ చేయగలడు. కాబట్టి అతనికి రూ.10.75 ధర కూడా తక్కువే అని నేను భావిస్తున్నా. అతను రూ.14 నుంచి రూ.15కోట్ల ప్రైస్ ట్యాగ్ లో ఉండాల్సిన ప్లేయర్. అతను స్లాగ్ ఓవర్లలో బౌలింగ్ చేస్తున్నాడు. అతను వికెట్లు తీయగలడు. రన్స్ సేవ్ చేయగలడు. మ్యాచ్ ప్రారంభంలో బౌలింగ్ వేస్తే తప్పకుండా పరుగులు రాకుండా కట్టడి చేయగలడు. అలాగే వికెట్లు తీస్తూ మ్యాచ్ టోన్ సెట్ చేయగలడు. కాబట్టి.. అతని ప్రైస్ ట్యాగ్ ఇంకా పెరగడానికి అర్హుడే. ఇక ఆర్సీబీ క్వాలిఫైయర్ 2కి అర్హత సాధించింది. బహుశా ఆర్సీబీ అతనికి బోనస్ ఇవ్వవచ్చు' అని వీరేంద్ర సెహ్వాగ్ తెలిపాడు.

ఈసారైనా గెలవాలని
ఇక మే 27న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫయర్ 2లో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు అదే వేదికగా (నరేంద్ర మోదీ స్టేడియం)లో 2022ఎడిషన్ టోర్నీ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఇక ఆర్సీబీ ఇప్పటివరకు ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోవడంతో ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలవాలని అటు ప్లేయర్లు, ఇటు అభిమానులు ఆశిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications