For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T10 క్రికెట్: మళ్లీ బ్యాట్ పడుతోన్న సెహ్వాగ్, ఈసారి కెప్టెన్‌గా బరిలోకి

By Nageshwara Rao
Virender Sehwag to play for Maratha Arabians alongside Mohammad Amir in Sharjah T10 Cricket League

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి విశ్రాంతి తీసుకున్న మాజీ క్రికెటర్లు మళ్లీ బ్యాట్ పడుతున్నారు. షార్జా వేదికగా డిసెంబర్‌లో జరగనున్న టీ10 క్రికెట్ లీగ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, కుమార సంగక్కర వంటి మాజీలతో పాటు ప్రస్తుత క్రికెటర్లు మహమ్మద్ అమీర్, కీరన్ పొలార్డ్ లాంటివారు గ్రౌండ్‌లో అడుగుపెట్టనున్నారు.

Sehwag Refuses To Speak On Any Possibility Of A Biopic

ఈ మేరకు షార్జాలో జరిగే టి10 క్రికెట్ లీగ్‌కు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ 14 నుంచి 16 వరకు షార్జాలో జరిగే ఈ టి10 క్రికెట్ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. మరాఠా అరేబియన్స్, పఖ్తూన్స్, పంజాబీ లెజెండ్స్, కేరళ కింగ్స్, బెంగాల్ టైగర్స్, టీం శ్రీలంక క్రికెట్ జట్లు బరిలోకి దిగనున్నాయి.

మరాఠా అరేబియన్స్ జట్టుకు వీరేంద్ర సెహ్వాగ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరో భారత మాజీ ఆటగాడు రాబిన్‌ సింగ్‌ కేరళ కింగ్స్‌ జట్టుకు కోచ్‌గా వ్యవహరించనున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్, ఇంగ్లండ్ లిమిటెడ్ ఓవర్స్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, డారెన్ సమీ, సునీల్ నరైన్ తదితరలు ఈ టోర్నీలో ఆడనున్నారు.

ఇక టీం శ్రీలంకలో మొత్తం శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈ జట్టుకు శ్రీలంక టెస్టు కెప్టెన్ దినేశ్ చండిమాల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. టోర్నీలో భాగంగా మరాఠా అరేబియన్స్‌ తన తొలి మ్యాచ్‌లో పఖ్తూన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ డిసెంబర్ 14న జరగనుంది.

టి10లో లీగ్‌లో పాల్గొనే జట్లు:
టీం శ్రీలంక క్రికెట్: లాహిరు తిరిమన్నే, దిల్షన్ మునవీర, కితురువన్ వితనగే, దినేష్ చండిమాల్, ఏంజెలో జయసింఘే, తిసారా పెరీరా, నిపున్ కరుణనాయకే, ఏంజెలో పెరీరా, షెహన్ జయసూర్య, అలంకార అసంక, హసరంగ, కసున్ మదుశంక, దుష్మంత చమీర, విశ్వ ఫెర్నాండో, సచిత్ర సేననాయకే, జెఫ్రే వండెర్సే

పంజాబీ లెజెండ్స్: షోయబ్ మాలిక్, ఉమర్ అక్మల్, మిస్బా ఉల్ హక్, కార్లోస్ బ్రాత్‌వైట్, ఫాహిమ్, అష్రఫ్, అబ్దుల్ రజాక్, షరీఫ్ అసదుల్లా, హసన్ అలీ, క్రిస్ జోర్డాన్, అదిల్ రషీద్, రంగన హెరాత్, దవ్లత్ జద్రాన్, ఉస్మానా మిర్, గులమ్ షబ్బీర్, ల్యూక్ రోంచి

కేరళ కింగ్స్: ఇయాన్ మోర్గాన్, ర్యాన్ టెన్ డోస్చటే, బాబర్ హయత్, రోహన్ ముస్తఫా, కీరన్ పొలార్డ్, షకీబ్ అల్ హసన్, పాల్ స్టిర్లింగ్, ఇమ్రాన్ హైదర్, సొహైల్ తన్వీర్, ప్లంకెట్, వాహబ్ రియాజ్, శామ్యూల్ బద్రీ, రయాద్ ఎమ్రిట్, చద్విక్ వాల్టన్, నికోలస్ పూరన్

బెంగాల్ టైగర్స్: రమీజ్ షాదాబ్, డారెన్ సమీ, డారెన్ బ్రావో, మహమ్మద్ నవాజ్, రోవ్‌మన్ పావెల్, సునీల్ నరైన్, ర్యాన్ మెక్‌లారెన్, మహమ్మద్ నవీద్, ముస్తఫిజుర్ రెహ్మాన్, రుమాన్ రయీస్, హసన్ ఖాన్, అన్వర్ అలీ, సర్ఫరాజ్ అహ్మద్, జాన్సన్ చార్లెస్, అండ్రే ఫ్లెచర్

ఫఖ్తూన్స్: ఫఖర్ జమాన్, తమీమ్ ఇక్బాల్, డ్యానే స్మిత్, అహ్మద్ షాజాద్, నజీబుల్లా జార్దాన్, షాహిద్ అఫ్రిది, అమ్జద్ జావేద్, మహమ్మద్ నబీ, లియామ్ డాసన్, జునైద్ ఖాన్, మహమ్మద్ ఇర్ఫాన్, సోహైల్ ఖాన్, ఉమర్ గుల్, షాహీన్ అఫ్రిది, సఖ్వలైన్ హైదర్

మరాఠా అరేబియన్స్: వీరేంద్ర సెహ్వాగ్, షైమన్ అన్వర్, అలెక్స్ హేల్స్, సిమ్మన్స్, రిల్లీ రోసో, రాస్ వైటెలే, ఇమాద్ వసీం, వాండర్ మెర్వ్, జహూర్ ఖాన్, మహమ్మద్ అమీర్, మహమ్మద్ సమీ, హార్దస్ విల్జోన్, పార్నెల్, కుమార సంగక్కర, కమ్రాన్ అక్మల్

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 1, 2017, 11:02 [IST]
Other articles published on Dec 1, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+