Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లి, ధోనీ కంటే అతనే అత్యుత్తమ క్రికెటర్: సెహ్వాగ్ (Video)

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ఫేవరేట్ ప్లేయర్ గురించి పేర్కొన్నాడు. భారత జట్టు ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ అత్యుత్తమ క్రికెటర్‌ అని అన్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లి కంటే రోహిత్‌నే బెస్ట్ క్రికెటర్ అంటూ సెహ్వాగ్ తెలిపాడు. 'అతడా లేదా ఇతడా' (దిస్ ఆర్ దట్) అని ఇద్దరిలో ఒక్కరిని ఎంచుకునే కార్యక్రమంలో అంతిమంగా హిట్‌మ్యాన్‌ను సెహ్వాగ్ సెలక్ట్ చేశాడు.

ఎంఎస్ ధోనీ- బెన్ స్టోక్స్‌లలో ఒక్కరిని యాంకర్ ఎంచుకోమనగా సెహ్వాగ్ ధోనీని ఎంపిక చేశాడు. ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ స్టోక్స్ కంటే భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోనీని ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత ధోనీ- ఏబీ డివిలియర్స్‌లలో సెహ్వాగ్ అనూహ్యంగా దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిలియర్స్‌ను సెలక్ట్ చేసుకున్నాడు.

Virender Sehwag Picks Rohit Sharma Over Virat Kohli and MS Dhoni in This or That Challenge

అనంతరం డివిలియర్స్-విరాట్ కోహ్లి‌లలో ఈ మాజీ డాషింగ్ ఓపెనర్ కోహ్లిని ఎంచుకున్నాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లి- ప్యాట్ కమిన్స్‌లలో విరాట్‌నే సెహ్వాగ్ సెలక్ట్ చేసుకున్నాడు. అయితే అప్పుడే యాంకర్ సెహ్వాగ్‌ను పరీక్ష పెట్టే ప్రశ్న అడిగింది. విరాట్ కోహ్లి- రోహిత్ శర్మలలో ఒక్కరిని ఎంచుకోమంది. సెహ్వాగ్ రోహిత్‌ను ఎంచుకున్నాడు. ఇక తర్వాత డేవిడ్ వార్నర్- రోహిత్, డేల్ స్టెయిన్-రోహిత్‌లలో.. సెహ్వాగ్ హిట్‌మ్యాన్‌నే సెలక్ట్ చేశాడు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే సెహ్వాగ్ ఎంపికపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా సత్తాచాటి టీ20 వరల్డ్ కప్ అందించిన రోహిత్ శర్మనే సెహ్వాగ్ అత్యుత్తమం అనడం సమంజసమే అని కొందరు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే రోహిత్ కంటే కోహ్లినే బ్యాటింగ్, సారథ్యంలో మెరుగైన ఆటగాడని మరికొందరు తమ వాదన వినిపిస్తున్నారు. భారత జట్టును పటిష్టం చేయడంలో కోహ్లి పాత్ర కీలకమని, టెస్టు ఫార్మాట్‌లో జట్టును బలోపేతం చేశాడని అంటున్నారు. మరోవైపు రోహిత్, కోహ్లి కంటే ధోనీనే ఆల్‌టైమ్ గ్రేట్ అని మరికొందరు అంటున్నారు.

Story first published: Tuesday, September 10, 2024, 7:58 [IST]
Other articles published on Sep 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+