
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఇండియా టాపార్డర్ (టాప్ త్రీ) ప్లేయర్ల ఎంపిక గురించి భారత మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక తన టాప్ త్రీలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని అతను పక్కన పెట్టాడు. టాప్ త్రీలో ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఉండాలని అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ లేదా రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్‌లో ఓపెనింగ్‌లో బరిలోకి దిగాలని ప్రస్తావించాడు. ఎందుకంటే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ల కలయిక 'ఆసక్తికరంగా' ఉంటుందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక ఇషాన్ కిషన్ 2021 మార్చిలో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో అరంగేట్రం చేశాడు. అతను తాను ఆడిన 16మ్యాచ్‌లలో 34.73సగటుతో 134.97 స్ట్రైక్ రేట్‌తో 521పరుగులు చేశాడు. అతను ఈ నెల మొదట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్‌ల హోమ్ సిరీస్‌లోనూ 150కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 206 పరుగులు చేసి సిరీస్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
సోనీ నెట్‌వర్క్‌లో సెహ్వాగ్ మాట్లాడుతూ.. 'టీ20లలో హార్డ్ హిట్టర్‌ల విషయానికి వస్తే ఇండియాకు చాలా మంది ఉన్నారు.నేను వ్యక్తిగతంగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్‌లు ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచ కప్ టోర్నీలో ఇండియా టాప్ త్రీ బ్యాటర్లుగా ఉండాలని భావిస్తున్నాను. రోహిత్ శర్మ లేదా ఇషాన్ కిషన్, ఇషాన్ లేదా కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుంది' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇక భారత పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ గురించి సెహ్వాగ్ మాట్లాడుతూ.. ఉమ్రాన్ మాలిక్ తన పేస్‌తో తనను చాలా ఆకట్టుకున్నాడని పేర్కొన్నాడు. అతను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి వారితో పాటు కీలక బౌలర్లలో ఒకరిగా టీమిండియా భవిష్యత్తు ప్లాన్లలో కచ్చితంగా భాగం కావాలని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ తరఫున 150కి.మీ వేగంతో కన్సిస్టెన్సీగా బౌలింగ్ చేసి రాణించిన ఉమ్రాన్ మాలిక్‌ను సెలెక్షన్ కమిటీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అతన్ని ఎంపిక చేసింది. ఇక ఆ సిరీస్లో అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. ఇక ఐర్లాండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లో అతనికి తుది జట్టులో చోటు దక్కి టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.