For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ: రోహిత్‌ను కాదని ఇషాన్‌ను ఎందుకు తీసుకొచ్చారు.. భారత జట్టు వ్యూహాలపై మాజీల ఆశ్చర్యం!!

Virender Sehwag, Madan Lal and VVS Laxman about Indian batting vs New Zealand at T20 World Cup 2021
T20 World Cup: Cricket World Shocked అసలు ఆ బ్యాటింగ్ ఆర్డర్ ఏంటి ? || Oneindia Telugu

హైదరాబాద్: ఆదివారం రాత్రి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో భారత్ ఓటమిపాలవ్వడం కంటే.. ఓడిన తీరే అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో ఓడినప్పుడు కూడా సగటు అభిమాని ఇలాంటి అసహనానికే గుయ్యాడు. అయితే కివీస్‌తో పోరులో తమ తప్పులు సరిదిద్దుకొని బాగా ఆడతారని ఆశించిన భారత బ్యాటర్లు మరోసారి చేతులెత్తేయడంతో.. ఏం చేయలేని స్థితిలో భారత్ ఉంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌ హిట్‌ పెయిర్‌ని కాదని, ఇషాన్‌తో ఓపెనింగ్‌ చేయించాలనే సలహా ఎవరిచ్చారో తెలియదు కానీ, ఈ వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. దీనిపై పలువురు క్రికెట్‌ దిగ్గజాలు ఏమన్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం.

అలా పంపడం తప్పుడు నిర్ణయమే:

అలా పంపడం తప్పుడు నిర్ణయమే:

'టీమిండియా గత రెండు మ్యాచ్‌ల్లో పట్టుదలతో ఆడలేకపోవడం దురదృష్టకరం. ఎవరైనా స్కోర్‌ బోర్డుపై సరైన పరుగులు చేయకపోతే మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించలేరు. 111 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే అద్భుతం జరగాలి. ఈ రెండు మ్యాచులలో భారత్ తేలిపోయింది. పొట్టి ఫార్మాట్‌లో ఆదిలోనే పైచేయి సాధించకపోతే తర్వాత చాలా కష్టమవుతుంది. అయితే కొన్నిసార్లు అన్ని నిర్ణయాలు కెప్టెన్‌ తీసుకోలేడు. రోహిత్‌ శర్మను వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా పంపడం అనేది కోహ్లీ ఒక్కడి నిర్ణయమే కాకపోయి ఉండొచ్చు. టీమ్ మెంటర్ ఎంఎస్ ధోనీ, కోచ్ రవిశాస్త్రి లాంటి వారు ఉండగా ఆ నిర్ణయం తీసుకోలేడు. ఏదేమైనా రోహిత్‌ను అలా పంపడం తప్పుడు నిర్ణయమే. అతడెన్నో ఏళ్లుగా ఓపెనర్‌గా రాణిస్తున్నాడు. ఈ ఒక్క మ్యాచుతో బ్యాటింగ్‌ ఆర్డర్‌ మొత్తం మారింది' అని మదన్‌లాల్‌ అన్నాడు.

 మార్పు బెడిసికొట్టింది:

మార్పు బెడిసికొట్టింది:

'బ్యాటింగ్‌ ఆర్డర్‌లో టీమిండియా ఈరోజు చేసిన మార్పు బెడిసికొట్టింది. రోహిత్‌ శర్మ లాంటి గొప్ప బ్యాటర్ మూడో స్థానంలో ఆడటం, అక్కడ ఎంతో బాగా రాణించే విరాట్ కోహ్లీ నాలుగులో ఆడటం అన్నీ విఫలమయ్యాయి. ఇషాన్‌ కిషన్ లాంటి యువకుడికి ఓపెనింగ్‌ చేసే బాధ్యతలు అప్పగించారు. అతడు కొడితే కొడతాడు లేకపోతే లేదు. అతడి లాంటి ఆటగాడు నాలుగు లేదా ఐదులో రావాల్సింది. అప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ఆడగలడు. ఇప్పుడిలా చేయడం ద్వారా రోహిత్‌.. నువ్వు లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్‌ ట్రెంట్‌బౌల్ట్‌ను ఎదుర్కోలేవు అని చెప్పినట్లు అవుతుంది. దీంతో ఇన్నాళ్లుగా ఓపెనింగ్‌ చేస్తున్న అతడికి తన బ్యాటింగ్‌ సామర్థ్యంపై సందేహం కలిగించినట్లు అవుతుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఇషాన్‌ 70 పరుగులు చేసుంటే మనమంతా మెచ్చుకునే వాళ్లం. కానీ అలా జరగనప్పుడే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అని సునీల్‌ గవాస్కర్ ట్వీట్ చేశాడు.

కోహ్లీపై విమర్శలు

కోహ్లీపై విమర్శలు

'ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలవ్వడంపై కెప్టెన్‌ కోహ్లీ విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే అందుకు కోహ్లీ ఒక్కడే కారణం కాదు. ఈ ఓటములకు జట్టు మొత్తంతో పాటు కోచ్‌లు కూడా బాధ్యత వహించాలి. ఇది భారత అభిమానులకు భయపెట్టే హలోయిన్‌ మొహ్మద్ డేగా మారిందని అజహరుద్దీన్‌ ట్వీటాడు. 'టీమిండియా చూస్తుంటే ఈ ప్రపంచకప్‌ నుంచి వైదొలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎంతో నైపుణ్యమున్న ఆటగాళ్లతో కూడిన భరత్ జట్టు సరైన ఆటతీరు, ఆలోచనా విధానంతో కనపడట్లేదు. వాళ్లింకా 2010 కాలం నాటి ఆట ఆడుతున్నారు. ఒక విధంగా నిజం చెప్పాలంటే. ఆ జట్టులో ఉన్న నైపుణ్యమైన ఆటగాళ్లు, రిజర్వ్‌ బెంచ్‌లో ఉన్నంత బలగంతో కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఏమీ సాధించలేకపోయారు' అని మైఖేల్‌ వాన్‌ ట్వీటాడు.

సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు:

సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు:

'ఇకపై భ్రాతా ఆటగాళ్లను ప్రతి జట్టుతో ఆడించాలి. వాళ్ల ఆటగాళ్లను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర లీగుల్లో ఆడించేలా చేయాలి' అని మైఖేల్‌ వాన్‌ ట్వీట్ చేశాడు. సూపర్‌-12లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన పోరులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. గ్రూప్‌-2లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన కోహ్లీసేన పట్టికలో నమీబియా కంటే కింద ఐదో స్థానంలో ఉంది. పాకిస్తాన్ మూడు విజయాలతో ఇప్పటికే సెమీస్ బెర్త్ దాదాపుగా ఖరారు చేసుకుంది. కివీస్ కూడా ఆఫ్ఘనిస్తాన్, నమీబియాలపై గెలిస్తే సెమీస్ చేరనుంది. ఇక భారత్ నాకౌట్‌కు అర్హత సాధించాలంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గడంతో పాటు అనేక సమీకరణాలు అనుకూలించాల్సి ఉంటుంది.

 సెలెక్షన్‌ కూడా బాలేదు:

సెలెక్షన్‌ కూడా బాలేదు:

'మెగా టోర్నీలో బాగా ఆటగాళ్ల ఆటతీరు ఏమాత్రం బాలేదు. గతంలో పలుమార్లు మాదిరే షాట్ల సెలెక్షన్‌ కూడా అస్సలు బాలేదు. ఈ దెబ్బతో భారత్ సెమీస్‌ చేరకుండా న్యూజిలాండ్‌ అడ్డుకుంది. ఇది టీమిండియాకు బాధ కలిగించేదే అయినా కచ్చితంగా జట్టులో ఎక్కడ లోపాలున్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది' అని వీరేంద్ర సెహ్వాగ్‌. అన్నాడు. 'ఈ ఓటమి టీమిండియాను బాధపెట్టాలి. బ్యాట్‌తో సరిగ్గా ఆడలేకపోయారు. షాట్‌ సెలెక్షన్‌ కూడా నమ్మశక్యంగా లేదు. కివీస్‌ బౌలర్లు అద్భుతంగా బంతులేసినా భారత బ్యాట్స్‌మెన్‌ వాళ్ల పని తేలిక చేశారు. వాళ్ల నెట్‌రన్‌రేట్‌ కూడా మెరుగ్గా ఉండటంతో ఇక సెమీస్‌ ఫైనల్‌లో చోటు అందని ద్రాక్షలా మారింది' అని వీవీఎస్ లక్ష్మణ్‌ అన్నాడు .

Story first published: Monday, November 1, 2021, 22:56 [IST]
Other articles published on Nov 1, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+