గిల్లీ బ్యాటింగ్ అంటే నాకెంతో ఇష్టం: 'బోల్ వీరూ బోల్'లో సెహ్వాగ్
హైదరాబాద్: 2000 సంవత్సరంలో ఆసీస్ మాజీ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఆటను చూడటమంటే తనకెంతో ఇష్టమని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ కామెంటేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
ప్రస్తుతం సెహ్వాగ్ భారత్-ఆసీస్ మధ్య జరుగుతోన్న టీ20 సిరీస్‌కు హిందీలో కామెంటేటర్‌గా సెహ్వాగ్ బాధ్యతలు నిర్వహిస్తోన్నాడు. తాజాగా వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి 'బోల్ వీరూ బోల్' కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆడమ్ గిల్‌క్రిస్ట్‌పై సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇప్పటి ఆసీస్ జట్టుకు చాలా తేడా ఉంది
'2000 సంవత్సరంలో ఉన్న ఆస్ట్రేలియా జట్టుకి ఇప్పటి ఆసీస్ జట్టుకు మధ్య చాలా తేడా ఉంది. అప్పటి జట్టులో ఆటగాళ్లు చాలా దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా గిల్‌క్రిస్ట్. అతనో భయంకరమైన బ్యాట్స్‌మెన్. వికెట్‌కీపర్ కూడా బాధ్యతలను ఎంతో బాగా నిర్వర్తించేవాడు. అతని బ్యాటింగ్ శైలి అంటే నాకెంతో ఇష్టం' అని సెహ్వాగ్ చెప్పాడు.

గిల్‌క్రిస్ట్‌లా బ్యాటింగ్ చేయాలని అనుకునేవాడిని
'గిల్‌క్రిస్ట్‌లా బ్యాటింగ్ చేయాలని ఎప్పుడూ అనుకునేవాడిని. ఒక్కోసారి గిల్లీ అవుటైనా మైదానం నుంచి వెళ్లేవాడు కాదు. ఒకసారి ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్‌లో దాదాపు పాక్ విజయం ఖాయమైంది. జస్టిన్ లాంగర్‌తో కలిసి అతను బ్యాటింగ్ చేస్తున్నాడు' అని అన్నాడు.

గిల్లీ అవుటైనా మైదానాన్ని వీడలేదు
'ఈ క్రమంలో బౌలర్ వేసిన ఓ బంతికి గిల్లీ అవుటయ్యాడు. కానీ అతను మైదానాన్ని వీడలేదు. అంపైర్ కూడా దానిని నాటౌట్‌గా డిక్లేర్ చేశాడు. మరోసారి వరల్డ్ కప్ సెమీఫైనల్లో పాక్‌తో ఇలాంటి సన్నివేశమే చోటు చేసుకుంది. అవుటయ్యాడు కానీ మైదానం నుంచి వెళ్లలేదు' అని సెహ్వాగ్ తెలిపాడు.

అంపైర్ కూడా దానిని నాటౌట్‌గా డిక్లేర్
'ఎప్పుడు వెళ్లాలో, ఎప్పుడు వెళ్లకూడదో గిల్లీకి బాగా తెలుసు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లుంటే అతను పెవిలియన్‌కు వెళ్లేందుకు ఆలోచించేవాడు' అని సెహ్వాగ్ తెలిపాడు. ఇదిలా ఉంటే మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 గౌహతి వేదికగా మంగళవారం జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications