
హార్దిక్ పాండ్యా ఇలాంటి కెప్టెన్సీ చేస్తాడనుకోలే
'నన్ను బాగా ఆకట్టుకున్న కెప్టెన్ హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా ఇంత అద్భుతంగా కెప్టెన్సీ చేస్తాడని నేను అనుకోలేదు. గతంలో అతని బ్యాటింగ్ విధానం చూసినా నేను అతను తన కెప్టెన్సీలో కూడా చాలా అగ్రెస్సివ్‌గా కన్పిస్తాడని భావించాను. కానీ అతను అలా కన్పించలేదు. అతను కూల్‌గా, ప్రశాంతంగా మ్యాచ్‌ల సందర్భంగా కన్పించాడు.' అని సెహ్వాగ్ క్రిక్‌బజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు.

ఆ జట్టు గెలుస్తుందని చెప్పట్లేదు
' ఇకపోతే లీగ్ దశలో అతని జట్టు చాలా మ్యాచ్‌లు గెలిచినందుకు నేను హార్దిక్ పాండ్యా నాకు ఇష్టమైన కెప్టెన్ అని చెప్పట్లేదు. అలాగే ఆ జట్టు బౌలింగ్ కోచ్ ఆశిష్ నెహ్రా నా స్నేహితుడు కాబట్టి హార్దిక్ మంచి కెప్టెన్ అనట్లేదు. కీలక సమయాల్లో ముఖ్యంగా జట్టు బౌలింగ్ చేస్తున్నప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నందున హార్దిక్ నాకు నచ్చిన కెప్టెన్ అని చెబుతున్నా.
డిఫెండింగ్ చేసేటప్పుడు మీరు బౌలింగ్ లేదా ఫీల్డింగ్‌లో సరైనా మార్పులు చేస్తే ఫలితాలు వస్తాయి. అలాంటి డిసిషన్ తీసుకోవంలో హార్దిక్ చాలా సిద్ధహస్తుడిగా కన్పిస్తున్నాడు. ముఖ్యంగా ఒత్తిడి టైంలో చాలా ప్రశాంతంగా ఉంటాడు. అందుకే అతని కెప్టెన్సీ నాకు నచ్చింది.' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.

కెప్టెన్‌గా, బ్యాటర్ గా రాణిస్తున్న హార్దిక్ పాండ్యా
ఇకపోతే లీగ్ దశలో గుజరాత్ టైటాన్స్ జట్టు 14మ్యాచ్‌లలో 10 మ్యాచ్‌లు గెలిచి 20పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఆ జట్టు విజయాల్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. జట్టు సెలక్షన్ దగ్గర నుంచి బౌలింగ్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఇప్పటికే పలువురు క్రికెట్ ప్రముఖులు అతన్ని ప్రశంసించారు.
అలాగే జట్టులో తాను ఓ కెప్టెన్ అనే ఫీలింగ్ పక్కన పెట్టానని, ప్రతి ఒక్కరూ జట్టుకు కెప్టెన్ అనే ఫీలింగ్ తీసుకు వచ్చానని అందుకే జట్టులో ప్రతి ప్లేయర్ మ్యాచ్ విన్నర్ గా మారుతున్నారని ఇటీవల హార్దిక్ పాండ్యా కూడా చెప్పాడు. ఏదేమైనా ఈ సారి టైటిల్ ఫేవరేట్ జట్లలో గుజరాత్ టైటాన్స్ కూడా ఒకటి.
ఇక ఈ ఐపీఎల్ 2022సీజన్లో హార్దిక్ పాండ్యా 13మ్యాచ్‌లు ఆడి 131 స్ట్రైక్ రేట్‌తో 413పరుగులు చేశాడు. అందులో 4హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. తొలిసారి కెప్టెన్ అందుకున్న మయాంక్ అగర్వాల్, రవీంద్రా జడేజా ఒత్తిడి తట్టుకోలేక మంచి ప్రదర్శన కనబర్చలేదు. కానీ పాండ్యా మాత్రం కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించాడు.