న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో తనదైన శైలిలో పంచ్‌లు వేస్తున్న మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. తాజాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పదివేల పరుగులు సాధించిన పార్థివ్ పటేల్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
సీనియర్లు, జూనియర్లు అని తేడా లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు సెహ్వాగ్. ఇక శుభాకాంక్షలు చెప్పడంలోనూ తన హాస్య చతురతను ప్రదర్శిస్తున్నాడు.
ఇటీవల ఇషాంత్ శర్మను బుర్జ్ ఖలీఫాతో పోల్చాడు. ఇప్పుడు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో పదివేల పరుగులు సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ పార్థివ్ పటేల్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపాడు.
'10,000 ముబారక్ పీపీ ఉరఫ్ సీసీ!' అంటూ ట్వీట్ చేశాడు. పీపీ అంటే పార్థివ్ పటేల్ అని అందరికీ అర్థమయింది. కానీ సీసీ ఏమిటో తెలియక ట్విటర్ ఫాలోవర్లు వెంటనే దీనిపై స్పందించారు. సీసీ అంటే చోటా చేతన్ కదా అంటూ రీట్వీట్ చేశారు.