
వైజాగ్: వెస్టిండీస్‌పై భారత కెప్టెన్ విరాట్ తన బ్యాట్‌తో విజృంభించాడు. విశాఖ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ (157 నాటౌట్; 129 బంతుల్లో 13ఫోర్లు, 4సిక్సులతో రికార్డుల మోత మోగించాడు. కేవలం 213 వన్డేల్లో 10వేల పరుగులు సాధించిన వేగవంతమైన క్రికెటర్‌గా ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత వహించాడు. ఈ సందర్భంగా పలువురు క్రీడా ప్రముఖులు ట్విటర్ వేదికగా కోహ్లీకి అభినందనలు తెలిపారు.

నీ బ్యాటింగ్‌లో తీవ్రత, నిలకడ అద్భుతం. వన్డేల్లో పది వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీకి అభినందనలు. ఇదేవిధంగా పరుగులు సాధించడం కొనసాగించు.
వన్డేల్లో పది వేల పరుగులు, 37వ శతకం పూర్తి చేసుకున్న కోహ్లీకి అభినందనలు. మరోసారి అద్భుత నిలకడతో ప్రత్యర్ధిపై పరుగుల క్రూరత్వం కొనసాగింది. నీ పరుగుల దాహం, నిలకడ, బ్యాటింగ్ తీవ్రత నిజంగా మహాద్భుతం.
సాఫ్ట్‌వేర్ ప్రతిసారి అప్‌డేట్ అవుతుటుంది. అలాగే కోహ్లీ కూడా నిలకడ అంటే ఏంటో నిర్వచించాడు. 11ఇన్నింగ్‌ల క్రితం వన్డేల్లో 9000 పరుగులు అందుకొని.. ఈ రోజు 37సెంచరీతో 10000 పరుగులు మైలురాయి ఛేదించిన కోహ్లీ.. ఈ ఆనంద సందర్భాన్ని ఆస్వాదించు.
ఛాంపియన్ కోహ్లీ గర్వంగా ఉంది.
వన్డేల్లో అత్యంత వేగంగా పదివేల పరుగులు పూర్తి చేసిన కోహ్లీకి అభినందనలు. ఏమా ఆటగాడు!
వన్డే క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న కోహ్లీకి అభినందనలు. గొప్ప ఆటగాడు, విధేయుడు. క్రికెట్‌లో నీ నైపుణ్యంతో, అంకితభావంతో, విధేయతతో అభిమానులను అధ్భుతంగా అలరిస్తున్నావు.
సచిన్ కంటే 54 ఇన్నింగ్‌లముందే 205వ వన్డే ఇన్నింగ్‌లోనే కోహ్లీ 10వేల పరుగుల మైలురాయిని చేరుకోవడం నిజంగా అద్భుతం.
వన్డే క్రికెట్‌లో అత్యంత వేగవంతంగా 10వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీకి సెల్యూట్.