బంగ్లాతో మ్యాచ్?: ఏబీకి సారీ చెప్పిన సెహ్వాగ్, రికార్డుల మోత
హైదరాబాద్: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్‌కు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సారీ చెప్పాడు. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో డివిలియర్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
నాలుగు నెలల విరామం తర్వాత తొలిసారి బరిలోకి దిగిన డివిలియర్స్ 15 ఫోర్లు, 7 సిక్సర్లు సాయంతో 104 బంతుల్లో 176 పరుగులు సాధించాడు. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన డివిలియర్స్, ఆ తర్వాత ఆడిన 34 బంతుల్లోనే సెంచరీని నమోదు చేశాడు. సెంచరీ తర్వాత ఏబీ మరింతగా రెచ్చిపోయాడు.

రుబెల్ బౌలింగ్‌లో డివిలియర్స్ అవుట్
దీంతో డబుల్ సెంచరీ సాధిస్తాడని సెహ్వాగ్‌తో సహా క్రికెట్ అభిమానులంతా ఆశించారు. తద్వారా వన్డేల్లో డబుల్ మార్క్‌ను చేరుకున్న తొలి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టిస్తాడని భావించారు. చివర్లో 47.4 ఓవర్లో రుబెల్ బౌలింగ్‌లో డివిలియర్స్ అవుటయ్యాడు.

నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించిన డివిలియర్స్
డివిలియర్స్.. ఆమ్లా (85; 92 బంతుల్లో 4 ఫోర్లు)తో మూడో వికెట్‌కు 136, డుమిని (30)తో నాలుగో వికెట్‌కు 117 పరుగులు జోడించి వెనుదిరిగాడు. దీంతో సెహ్వాగ్ ఒక్కసారిగా నిరాశ చెందాడు. డివిలియర్స్ డబుల్ సెంచరీ సాధిస్తాడని ఎంతో ఆశించిన సెహ్వాగ్ 48వ ఓవర్‌లో అవుట్ కావడంతో అభిమానులకు సారీ చెప్పాడు.
సారీ చెప్పిన సెహ్వాగ్
'నువ్వు బౌలర్లను ఊచకోత కోస్తుంటే చూసి ఆనందించా. కానీ డబుల్ చేజారడం బాధను కలిగించింది' అని సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 47.5 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది.

రెండుసార్లు 150 పరుగుల మార్క్ అందుకున్న తొలి ఆటగాడు
ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే చేజిక్కించుకుంది. తాజా ఇన్నింగ్స్‌తో డివిలియర్స్ 70 బంతుల్లో ఆరుసార్లు సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. తర్వాతి స్థానంలో నాలుగు సెంచరీలతో ఆఫ్రిది, సెహ్వాగ్ ఉన్నారు. 100 బంతుల్లోపే రెండుసార్లు 150 పరుగుల మార్క్ అందుకున్న తొలి ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications