ముంబై: భారత్ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాలనేది నా కల... ఆ కలను నెరవేర్చుకున్నానని టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 'ఈఎస్పీఎన్ క్రిక్‌ఇన్పో' కి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు. తాను క్రికెట్‌లో సాధించాల్సింది ఏమీ లేదని అన్నాడు.
ఇప్పటికే 100 టెస్టులను పూర్తి చేసుకున్న తనకు క్రికెట్‌లో సాధించడానికి ఇంకేమీ మిగల్లేదని చెప్పాడు. ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని... క్రికెట్ ఆడటాన్ని ఇంకా ఆస్వాదిస్తున్నానని, ఇంకొ మూడేళ్లు కొనసాగే అవకాశం ఉందని తెలిపాడు.
భారత్ క్రికెట్ జట్టుకు ఆడటం సులభం కావచ్చు... కానీ, 10-15 ఏళ్లు కొనసాగడం మాత్రం అత్యంత కష్టమని సెహ్వాగ్ చెప్పాడు. రిటైర్‌మెంట్ తర్వాత ఏమి చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నానని అన్నాడు.

2012లో ఇంగ్లాండ్‌పై 100వ టెస్టు ఆడిన ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ గుర్తింపు పొందాడు. టెస్టు క్రికెట్లో 8000, 10,000 పరుగులు సాధించామనేది ఎవరూ లెక్కచేయరు. అది కేవలం వ్యక్తిగత సంతృప్తి మాత్రమేనని చెప్పుకొచ్చారు. భారత్‌కు ఆడాలన్నదే తన కల.. ఆ కలను సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు.
2011లో భారత్ వరల్డ్ కప్ గెలవడంలో వీరేంద్ర సెహ్వాగ్ కూడా కీలక పాత్ర పోషించాడు. భారత్ తరుపున సెహ్వాగ్ 104 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. భారత్ తరుపున చివరిసారిగా మార్చి 2013లో ఆడాడు. వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ 30 ప్రాబబుల్స్‌లో వీరేంద్ర సెహ్వాగ్‌కు చోటు దక్కలేదు.