Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భార్యతో కలిసి బ్యాటింగ్ చేస్తే.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోనే : సెహ్వాగ్

న్యూఢిల్లీ : ఎదుర్కొనేది తొలి బంతా.. చివరి బంతా.. బౌన్సరా, బౌలర్ ఎవరు? లాంటి లెక్కలతో సంబంధం లేకుండా.. ఎటాకింగ్ బ్యాటింగ్ తో విరుచుపడడానికి వీరూ ఎప్పడు వెనుకాడలేదు. అందుకే టీమ్ ఇండియా ఓపెనర్లలో వీరేంద్ర సెహ్వాగ్ ది ఎప్పటికీ ఓ ప్రత్యేక స్థానమే.

ట్రిపుల్ సెంచరీ మార్క్ కు దగ్గరలో ఉన్నప్పుడు కూడా.. డిఫెన్స్ కు ప్రాధాన్యమివ్వకుండా సిక్సర్ తో ట్రిపుల్ ను అందుకున్న తెగువ వీరూది. అందుకే సెహ్వాగ్ డేరింగ్ గేమ్ ను అభిమానులు అమితంగా ఎంజాయ్ చేసేవాళ్లు. అయితే క్రీజులో ఇంత తెగువ ప్రదర్శించే వీరూ లాంటి క్రికెటర్.. ఓ వ్యక్తి విషయంలో మాత్రం తనది బ్యాక్ స్టెప్పే అంటున్నాడు.

Virender Sehwag Hits Six After Six On Twitter And We Can Barely Keep Up

ఆ వ్యక్తి అరవీర భయంకర బౌన్సర్లతో చెండాడే బౌలరో.. లేక మరెవరో కాదు. వీరూ భార్య ఆర్తి. అవును.. భార్యతో కలిసి ఆడాల్సి వస్తే.. తాను నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోనే ఉంటానంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు వీరూ. 'భార్యతో కలిసి బ్యాటింగ్ చేయాల్సి వస్తే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉండాలి. ఆమెను మాట్లాడనిద్దాం, అవసరమైనప్పుడు రన్ కూడా తీస్తుంది..' అంటూ సరదాగా తన ట్విట్టర్ లో చేశాడు వీరూ.

ఈమధ్య బ్రిటన్ జర్నలిస్ట్ మోర్గాన్ ను తన కౌంటర్ ట్వీట్లతో ఎటాక్ చేసిన వీరూ.. ఇలా సరదా పోస్టులతోను అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి వీరూ అభిమానులు మాత్రం ఆయన ట్వీట్లను భలే ఎంజాయ్ చేస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+