హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీలతో పాటు క్రికెటర్ల పుట్టినరోజులకు తనదైన శైలిలో శుభాకాంక్షలు చెబుతుండటాన్ని మనం చూశాం.
అయితే ఇలా ట్వీట్లు చేయడం ద్వారా తాను డబ్బులు కూడా సంపాదిస్తున్నానని చెప్పిన సెహ్వాగ్ తాజాగా కొత్త అవతారం ఎత్తాడు. 'వీరూ జ్ఞాన్' పేరుతో ఓ కొత్త షో మొదలుపెట్టాడు. ఈ షోలో క్రికెట్ గురించి తన అభిప్రాయాలు చెప్పనున్నాడు. ఈ షో తొలి ఎపిసోడే మంచి హిట్ టాక్ కొట్టేసింది.
'వీరూ జ్ఞాన్' పేరుతో మొదలు పెట్టిన తొలి షోలో సెహ్వాగ్ భారత్, ఇంగ్లాండగ్ జట్ల మధ్య ముగిసిన వన్డే సిరిస్‌పై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ఈ టాక్ షోలో డ్యుయల్ రోల్‌లో సెహ్వాగ్ అద్భుతమైన కామెడీని పండించాడు.
సోషల్ మీడియా సాధనం యూట్యూబ్‌లో ఉన్న ఈ వీడియోను సెహ్వాగ్ అభిమానులతో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్టు చేశారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ.. సెహ్వాగ్ షోను 'హేరా ఫేరి ఆఫ్ క్రికెట్. తప్పక చూడండి' అంటూ కామెంట్ చేశాడు.
ఇక టీమిండియా వెటరన్ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా సెహ్వాగ్‌పై ప్రశంసలు కురిపించాడు. 'బౌండరీలు కురిపించడం సెహ్వాగ్‌కు ఇష్టమని, కొన్నిసార్లు ఇలా నోటితో కూడా. తప్పక చూడండి' అంటూ యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.