Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్ల‌యిన మ‌గ‌వారికి సెహ్వాగ్ ఇచ్చిన సింపుల్ టిప్ ఇదే

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్ల పుట్టినరోజులకు తనదైన శైలిలో ట్విట్టర్‌లో విష్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మంగళవారం సోష‌ల్ మీడియాలో పెళ్లయిన మ‌గ‌వారికి సెహ్వాగ్ ఓ టిప్ ఇచ్చాడు. జీవితం సుఖంగా సాగిపోవాలంటే ఏం చేయాలనే దానిపై రెండు ముక్క‌ల్లో చెప్పాడు. ఇంత‌కీ సెహ్వాగ్ చెప్పిన ఆ సింపుల్ మంత్ర ఏంటంటే! 'వైఫ్ సుఖీ.. లైఫ్ సుఖీ అంటే భార్య సుఖంగా ఉంటే.. జీవితం సుఖంగా ఉంటుంది.. అంతే సింపుల్‌' అని భార్య ఆర్తితో కలిసి ఉన్న ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేశాడు.

Virender Sehwag Has the Perfect Advice for Married Men

ఇదిలా ఉంటే టీమిండియా ప్రధాన కోచ్ పదవికి సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తున్నాడు. మే 31 నాటికి గడువు ముగిసే సమయానికి కోచ్ పదవి కోసం టామ్‌మూడీ, రిచర్డ్‌ పైబస్‌, లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌, దొడ్డా గణేష్‌లు దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరితో పాటు టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి కూడా కోచ్ రేసులోకి వచ్చాడు. తాను కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు. కోచ్‌గా అనిల్‌కుంబ్లే తప్పుకోవడంతో ఆయన స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారా? అని క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+