
భారత్ వెతుకుతోన్న ఆల్‌రౌండర్ అతడే అవుతాడు
'ఆసీస్‌తో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో పాండ్యా ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రతి మ్యాచ్‌లో అతడు 10 ఓవర్లు వేశాడు. అటు బంతితోనూ ఇటు బ్యాట్‌తోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇదే ప్రదర్శన అతను భవిష్యత్తులోనూ కొనసాగిస్తే భారత్ వెతుకుతోన్న ఆల్‌రౌండర్ అతనే అవుతాడు. టీమిండియా భవిష్యత్తు ఆల్ రౌండర్ అతడే' అని సెహ్వాగ్ అన్నాడు.

ఐదు వన్డేల సిరిస్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శన
ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరిస్‌లో పాండ్యా అద్భుత ప్రదర్శన చేసి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచ్‌ల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులతో పాటు మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం పాండ్యా సొంతం చేసుకున్నాడు.

యువీ, కపిల్‌తో పోల్చడం అప్పుడే సరికాదు
ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు పలువురు పాండ్యాను టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో పొల్చిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా సెహ్వాగ్ స్పందించాడు. 'పాండ్యా లాంటి ఆటగాడిని ఏస్థానంలోనైనా బ్యాటింగ్‌కు దింపొచ్చు. ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో ఎదుగుతోన్న పాండ్యాను యువరాజ్ సింగ్, కపిల్‌దేవ్‌తో పోల్చడం అప్పుడే సరికాదు' అని అన్నాడు.

వారిద్దరూ భారత క్రికెట్‌కు ఎంతో చేశారు
వారిద్దరూ తమ క్రికెట్ కెరీర్‌లో ఎన్నో విజయాలను సాధించారు. దీనికి తోడు భారత క్రికెట్‌కు ఎంతో చేశారు. ప్రపంచకప్‌లు అందించారు. వీరిలాగా అతడు క్రికెట్‌లో సుదీర్ఘకాలం పాటు కొనసాగి విజయవంతమైతే అప్పుడు పోల్చడం సరైంది' అని సెహ్వాగ్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











